Home » ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కోలుకున్నవారే ఎక్కువ
Published
2 months agoon
By
vamsiరోజుకు పది వేల కేసులు నమోదై దేశవ్యాప్తంగా రాష్ట్రం గురించి ఆందోళన కలిగేలా వచ్చిన కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 545 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,62,758కి చేరుకుంది. ఇందులో 8,42,416 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 13394 కేసులు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 10 మంది చనిపోగా.. కరోనాతో చనిపోయినవారి సంఖ్య 6వేల 948కి చేరుకుంది.
జిల్లాలవారీగా అనంతపురంలో 19, చిత్తూరు 32, తూర్పుగోదావరి జిల్లాలో 104, గుంటూరు 117, కడపలో 31, కృష్ణాలో 44, కర్నూలులో 10, నెల్లూరు 30, ప్రకాశంలో 25, శ్రీకాకుళంలో 19, విశాఖపట్నంలో 21, విజయనగరంలో 17, పశ్చిమ గోదావరిలో 76కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా క్షీణించాయి. గత 24 గంటలు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1000 కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య రెట్టింపుగా ఉంది. మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉంది.
గత 24 గంటల్లో 47,130కరోనా పరీక్షలు నిర్వహించగా 545మందికి కరోనా సోకినట్లు తేలింది. గత 24 గంటల వ్యవధిలో 1390 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,39,521కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 96,62,220 కరోనా నమూనాలను పరీక్షించారు.
ఇక దేశంలోనూ కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో 44,059 నమోదుయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91,39,866కు పెరిగింది. ఇదే సమయంలో 41,024 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 85,62,641కి చేరింది. రికవరీ రేటు 93.68శాతంగా ఉంది. గత 24 గంటల్లో 511 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,738కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,43,486 యాక్టివ్ కేసులు ఉన్నాయి.