100 crores movies : వరుస 100 కోట్ల సినిమాలు..

ప్రెజెంట్ సినిమా ఎంత సంపాదిస్తే, ఎంత త్వరగా సంపాదిస్తే అంత పెద్ద హిట్ అన్నట్టు. ఈమధ్య ఫైనల్ రిజల్డ్ తో సంబంధం లేకుండా వంద కోట్ల క్లబ్ లోకి కొన్ని సినిమాలు ఈజీగా ఎంట్రీ ఇచ్చాయి. అందులో కొన్ని...............

100 crores movies : వరుస 100 కోట్ల సినిమాలు..

100 Crores Movies

100 crores movies :  ప్రెజెంట్ సినిమా ఎంత సంపాదిస్తే, ఎంత త్వరగా సంపాదిస్తే అంత పెద్ద హిట్ అన్నట్టు. ఈమధ్య ఫైనల్ రిజల్డ్ తో సంబంధం లేకుండా వంద కోట్ల క్లబ్ లోకి కొన్ని సినిమాలు ఈజీగా ఎంట్రీ ఇచ్చాయి. అందులో కొన్ని పాన్ ఇండియా సినిమాలుంటే మరికొన్ని రీజనల్ సినిమాలున్నాయి. మొత్తానికి 2022లో చాలా ఫాస్ట్ గా 100 కోట్ల క్లబ్ లో చేరిన టాప్ సినిమాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎంత త్వరగా 100 కోట్ల క్లబ్ లో చేరితే అంత పెద్ద రికార్డ్ కొట్టినట్టు. ఇండస్ట్రీలో కలెక్షన్ల ప్రమాణంగానే సినిమా రిజల్ట్ ను ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. టాక్ తో సంబంధం లేకుండా మేకర్స్ కు కూడా మా సినిమా ఇంత కలెక్ట్ చేసిందని చెప్పుకునే పద్ధతిని ఫాలో అవుతున్నారు. 2022లో వన్ డేలో 100 కోట్లు సంపాదించిన మూవీగా రికార్డ్ కొట్టిన ఫస్ట్ మూవీ ట్రిపుల్ ఆర్. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఫస్ట్ డేతోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది జక్కన్న సినిమా. లాంగ్ రన్ లో 1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టారు ఎన్టీఆర్, చరణ్.

ట్రిపుల్ ఆర్ తర్వాత బాక్సాఫీస్ రాఖీబాయ్ వన్ డేలో 100 కోట్లు సాధించి చూపించాడు. వారం రోజులు ఆడటమే గగనమవుతున్న ఈరోజుల్లో కేజీఎఫ్ 2 సక్సెస్ ఫుల్గా 400 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. రిలీజ్ అయిన దగ్గరి నుంచి ఏదో ఒక రికార్డ్ ను కొల్లగొడుతూనే ఉన్న కేజీఎఫ్2 లాంగ్ రన్ 1250 కోట్లను తన అకౌంట్ లో వేసుకుంది. మొత్తానికి హైస్పీడ్ లో కేవలం ఒక్కరోజులో 100 కోట్లను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ కా బాప్ అనిపించాడు రాకింగ్ స్టార్.

పాన్ ఇండియా మూవీగా రిలీజై కేవలం తమిళ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది బీస్ట్. విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్ లో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన బీస్ట్ వరల్డ్ వైడ్ 100 కోట్లను రాబట్టడానికి రెండు రోజులు పట్టింది. డివైడ్ టాక్ వచ్చినా తమిళ్ లో బీభత్సమైన కలెక్షన్స్ సాధించిందంటే కేవలం విజయ్ కున్న మాస్ ఫాలోయింగ్ కారణంగానే. లాంగ్ రన్ లో మాత్రం 250 కోట్ల దగ్గరే కోలీవుడ్ స్టార్ సినిమాకు బ్రేకులు పడ్డాయి.

విజయ్ తర్వాత 2022లో ఫాస్ట్ గా 100 కోట్ల గ్రాస్ బార్డర్ ను క్రాస్ చేసిన స్టార్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. రెండు రోజుల్లో సర్కారు వారి పాట 100 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం మహేశ్ మ్యానియాతోనే, రీజనల్ సినిమాగా రిలీజ్ అయి, సర్కారు వారి పాటకు డివైడ్ టాక్ వినిపించినా 100 కోట్ల కలెక్షన్లని సాధించింది. ఇక ఈ సినిమా కూడా దాదాపు 200 కోట్ల పైగా సాధించింది. ఒక రీజనల్ సినిమా ఈ రేంజ్ లో సాధించింది అంటే పెద్ద రికార్డ్.

సినిమా ఫ్లాప్ ముద్ర వేయించుకున్నా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఫాస్ట్ గా రాధేశ్యామ్ ను 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. రెండురోజుల్లోనే రాధేశ్యామ్ సైతం 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. వీకెండ్ కావడం, తొలి రెండు రోజులు ఫ్యాన్స్ ఈజ్ చూపించడంతో రాధేశ్యామ్ కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి. కానీ అప్పటికే టాక్ బయటికొచ్చేయడంతో కామన్ ఆడియెన్స్ రాధేశ్యామ్ ను లైట్ తీసుకున్నారు. ఏదేమైనా ఆ మాత్రమైనా కలెక్షన్స్ చూపించందంటే గ్లోబల్ స్టార్ ఇమేజ్ మాత్రమే ఏకైక రీజన్.

Prabhas : మరో ప్రాజెక్టుకి లైన్ క్లియర్ చేసిన ప్రభాస్.. ఈ లైనప్ ఏంటి బాబు..

ఇటీవల వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F3 సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ సినిమా జోనర్ తో అయినా కొద్దిగా లేట్ అయినా 100 కోట్ల క్లబ్ లో చేరింది. 10 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లని కలెక్ట్ చేసింది.

కమల్ హాసన్ లీడ్ రోల్ లో రీసెంట్ గా రిలీజైన విక్రమ్ మూడు రోజుల గ్రాస్ కలెక్షన్స్ 100 కోట్లను టచ్ చేశాయి. లోకనాయకుడి నటనకు తోడు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతిల పర్ఫామెన్స్ తోడవడం విక్రమ్ కి కలిసొచ్చింది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ చూపించిన యాక్షన్ అండ్ మాస్ హై ఇంటెన్స్ సీన్స్ సినిమాను బ్లాక్ బాస్టర్ చేసాయి. కేవలం మూడు రోజుల్లో 100 కోట్లకు పైగా సాధించి రోజురోజుకి స్టామినా పెంచుకుంటోంది విక్రమ్. ఇలా ఈ సంవత్సరం మొదటి సగంలోనే చాలానే సౌత్ సినిమాలు 100 కోట్ల క్లబ్ అందుకుంటే బాలీవుడ్ మాత్రం తడబడుతూనే వుంది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లో రిలీజ్ అయిన భూల్ భూలయ సినిమా ఒక్కటే 100 కోట్ల మార్క్ ని టచ్ చేసింది.