Google Doubts: గూగుల్ డౌట్లకు ఎక్కువ ఫీజు అంటున్న డాక్టర్

డాక్టర్ దగ్గరికి వెళ్లే పేషెంట్లు తమకున్న సమస్యల్ని చెప్పుకోవడం మామూలే. డాక్టర్లు వాటికి తగిన మందులు ఇస్తుంటారు. అయితే, ఈమధ్య పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు లేనిపోని డౌట్స్‌తో టైమ్ వేస్ట్ చేస్తున్నారు.

Google Doubts: గూగుల్ డౌట్లకు ఎక్కువ ఫీజు అంటున్న డాక్టర్

Google Doubts

Google Doubts: డాక్టర్ దగ్గరికి వెళ్లే పేషెంట్లు తమకున్న సమస్యల్ని చెప్పుకోవడం మామూలే. డాక్టర్లు వాటికి తగిన మందులు ఇస్తుంటారు. అయితే, ఈమధ్య పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు లేనిపోని డౌట్స్‌తో టైమ్ వేస్ట్ చేస్తున్నారు. డాక్టర్లను అనేక ప్రశ్నలతో విసిగిస్తున్నారు. దీనికి కారణం పేషెంట్లు ముందుగా తమకున్న లక్షణాలు, సమస్యల గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడమే. గూగుల్‌లో వెతికినప్పుడు బోలెడంత సమాచారం కనిపిస్తుంది. దీనితో చాలా భయాలు, సందేహాలు మొదలవుతున్నాయి పేషెంట్లలో. దీంతో పేషెంట్లు తమకు గూగుల్‌లో వచ్చిన డౌట్లను డాక్టర్లను అడుగుతున్నారు. ఇది డాక్టర్లకు కూడా కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తోంది.

pawan kalyan: వైఎస్ఆర్‌సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలి: పవన్ కళ్యాణ్

అయితే, ఒక డాక్టర్ మాత్రం దీనికి తనదైన పరిష్కారం కనుగొన్నాడు. ఎవరైనా పేషెంట్లు తన దగ్గరికి వచ్చినప్పుడు గూగుల్‌ డౌట్స్ అడిగితే, సాధారణ ఫీజుకంటే ఎక్కువ వసూలు చేస్తా అంటున్నాడు. దీనికి సంబంధించి తన ఫీజు చార్టులో కూడా ఈ విషయాన్ని ప్రకటించాడు. అందులో తన ఫీజుకు సంబంధించిన వివరాల్ని రాశాడు. ఆ డాక్టర్ ఎవరో తెలీదు కానీ.. అతడి ఫీజు వివరాలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చర్చకు దారితీస్తున్నాయి. చాలా మంది ఆ డాక్టర్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు కూడా. ఇంకొందరు డాక్టర్ చమత్కారాన్ని ప్రశంసిస్తున్నారు.