కరెంటు చట్ట సవరణ బిల్లు : రైతుల గుండె దడదడ..ఫ్రీ కరెంట్ బంద్!

  • Published By: madhu ,Published On : May 8, 2020 / 02:31 AM IST
కరెంటు చట్ట సవరణ బిల్లు : రైతుల గుండె దడదడ..ఫ్రీ కరెంట్ బంద్!

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్ట సవరణ బిల్లు రైతుకు శాపంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ చట్టం-2003కు భారీగా సవరణలను ప్రతిపాదిస్తూ.. ఓ ముసాయిదాను ఏప్రిల్‌ 17న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అభిప్రాయాలు, సవరణలు, సూచనలు తెలియచేయాలంటూ రాష్ట్రాలను, సంస్థలను కోరింది.

ఇకపై ఉచిత విద్యుత్‌ ఉండదని, 24 గంటల పాటు కరెంటు సరఫరా చేయరనే ప్రచారం జరుతోంది. ఫలితంగా..బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  మీటర్లు.. బిల్లులు మళ్లీ పుట్టుకొస్తాయి.. వెరసి రైతులు.. వ్యవసాయం కునారిల్లిపోయే పరిస్థితి తలెత్తుతుంది. రైతులు నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు బిల్లులు చెల్లించే అవకాశం ఏర్పడనుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. 

చట్టరూపం దాలిస్తే : – ప్రతి కనెక్షన్‌కీ మీటర్‌ పెట్టాలి. ప్రతి కనెక్షన్‌కు త్రీఫేజ్‌ మీటర్‌ను బిగించాలి. ఈ బాధ్యత డిస్కంలే చూసుకోవాలి. అంతంతమాత్రంగా ఉన్న…విద్యుత్‌ సంస్థలు ఇంత భారాన్ని మోయగలదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. లక్షల కనెక్షన్లకు మీటర్లు బిగించాలంటే చాలా టైం పడుతుందని, మీటర్లు తేవడం వీటిని పరీక్షించడం.. బిగించడం, ప్రతినెలా రీడింగ్‌, బిల్లు జనరేట్‌ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పనిగా వెల్లడిస్తున్నారు. 

నామమాత్రంగానే సబ్సిడీని ఒకేసారి ఫిక్స్ చేస్తారు. దీనివల్ల రైతుకు ఎలాంటి మేలు జరగదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 24.4 లక్షల వ్యవసాయ కనెక్షన్ల నుంచి నెలకు రూ.వెయ్యి కోట్లు బిల్లుల రూపంలో రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేంద్రం ఇచ్చే సబ్సిడీ అంతంత మాత్రమే.

మొత్తంగా కరెంటు కథ కేంద్రం చేతుల్లోకి వెళుతుందని, సబ్సిడీ ఇంతే ఇస్తామని ఫిక్స్‌చేసి .. రేట్లు పెంచే పరిస్థితి వస్తే..ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం తీసుకొస్తున్న ఎలక్ట్రిసిటీ బిల్లు వంద శాతం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతమని, దానిని చాలా స్ట్రాంగ్‌గా వ్యతిరేకిస్తామని సీఎం కేసీఆర్..ఇప్పటికే చెప్పారు. 

Also Read | కరెంటు మీటర్ బిల్లు ముట్టుకుంటే షాక్..ఎందుకు ?