తెల్లారిన బతుకులు : వలస కూలీల పైనుంచి వెళ్లిన రైలు..15 మంది మృతి

  • Published By: madhu ,Published On : May 8, 2020 / 04:48 AM IST
తెల్లారిన బతుకులు : వలస కూలీల పైనుంచి వెళ్లిన రైలు..15 మంది మృతి

వలస కూలీల బతుకులు తెల్లారిపోయాయి. నిద్రలోనే అనంతలోకాలకు వెళ్ళిపోయారు. పట్టాలపై పడుకున్న వారిపై నుంచి రైలు వెళ్లడంతో 15 మంది వలస కూలీలు చనిపోయారు. అత్యంత విషాదకరమైన ఈ’ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పలువురు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేశారు. వలస కూలీలు చనిపోవడం బాధాకరమని వెల్లడించారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం మూడుసార్లు లాక్ డౌన్ కొనసాగించారు. ప్రస్తుతం 2020, మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. దీంతో వలస కూలీలపై పెను ప్రభావం చూపెట్టింది. స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాలినడక కొంతమంది బయలు దేరితే..మరికొంతమంది..సైకిళ్లపై వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో కొంతమంది వలస కూలీలు (జల్సా – ఔరంగాబాద్) రైలు పట్టాలపై పడుకున్నారు. వీరి వెంట చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 2020, మే 07వ తేదీ..రాత్రి వారిపై నుంచి రైలు వెళ్లిపోయింది. నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఆ ప్రాంతం మొత్తం బీభత్సంగా మారిపోయింది. ముక్కలు ముక్కలుగా శరీరాలు తెగిపడ్డాయి. మొత్తం 15 మంది చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రైళ్లు నడవడం లేదనే భావించి వీరంతా పట్టాలపై పడుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.