రద్దీని నివారించేందుకు : లిక్కర్ కొనే వారి చేతివేలిపై Ink గుర్తు

  • Published By: madhu ,Published On : May 8, 2020 / 05:58 AM IST
రద్దీని నివారించేందుకు : లిక్కర్ కొనే వారి చేతివేలిపై Ink గుర్తు

కరోనా వైరస్ కారణంగా మూతబడిన లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు 40 రోజుల వరకు షాపులకు తాళాలు పడ్డాయి. ప్రస్తుతం వైన్స్ షాపులు ఓపెన్ చేయడంతో మందుబాబులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొనుగోలు చేసే వారు..విక్రయించే వారికి కొన్ని కండీషన్స్ పెట్టింది. అయితే..ఎక్కువ మంది జనాలు వస్తుండడంతో మందుషాపుల వద్ద విపరీతమైన రష్ నెలకొంటోంది. దీంతో వీరిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఒక్కరికి ఒక బాటిల్ ఇవ్వడం..తదితర కొన్ని కండీషన్స్ పెడుతున్నాయి. తాజాగా లిక్కర్ కొనుగోలు చేసే వారి చేయిపై ఇంక్ గుర్తు వేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

లిక్కర్ షాపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. హోషంగాబాద్ జిల్లాలో మద్యం కొనుగోలు చేసే వారి పేర్లు, చిరునామా, మొబైల్ ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. వీరి చేతి వేలికి సిరా గుర్తు వేస్తున్నారు. మళ్లీ మళ్లీ దుకాణానికి రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు. నాన్ కంటైన్ మెంట్ జోన్లలో 50 మద్యం దుకాణాలకు అనుమతినిచ్చామని, రద్దీని నివారించేందుకు కొనుగోలుదారులకు సిరా గుర్తు పెట్టే పద్ధతి అమలు చేస్తున్నామని హోషంగాబాద్ జిల్లా ఎక్జైజ్ శాఖ అధికారి అభిషేక్ తివారీ పేర్కొన్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలో మద్యాన్ని కొనుగోలు చేసే వారికి టోకెన్ ఇవ్వాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మద్యం షాపుల ఎదుట ప్రజలు గుమికాకుండా ఉంటారని ప్రభుత్వం వెల్లడిస్తోంది. 

Also Read | బుర్ఖా వేసుకుని గుడిలో శానిటైజేషన్ చేస్తున్న కరోనా వారియర్