Cat Fish: 10టీవీ ఎఫెక్ట్.. చేపల చెరువుల ధ్వంసం!

ఏపీలోని ప్రకాశంజిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ పెంపకాన్ని 10టీవీ బైటపెట్టింది. పొలాల మధ్యలో చెరువులలో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఈ చేపల పెంపకాన్ని నిషేదించినా అక్రమంగా పెంచి కోరమీను చేపల ముసుగులో వీటిని అమ్మేస్తున్నారు. ఈ చేపల పెంపకం పర్యావరణానికి తీరని హాని కాగా..

Cat Fish: 10టీవీ ఎఫెక్ట్.. చేపల చెరువుల ధ్వంసం!

Cat Fish

Cat Fish: ఏపీలోని ప్రకాశంజిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ పెంపకాన్ని 10టీవీ బైటపెట్టింది. పొలాల మధ్యలో చెరువులలో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఈ చేపల పెంపకాన్ని నిషేదించినా అక్రమంగా పెంచి కోరమీను చేపల ముసుగులో వీటిని అమ్మేస్తున్నారు. ఈ చేపల పెంపకం పర్యావరణానికి తీరని హాని కాగా.. తినే వారికి క్యాన్సర్ కారకం కూడా. అయినా ఏపీలో వీటి పెంపకం మితిమీరుతుంది. ఇదే విషయాన్ని సామజిక బాధ్యతగా తీసుకున్న 10టీవీ వరస కథనాలను ప్రసారం చేయడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

ప్రకాశం జిల్లాలో క్యాట్‌ఫిష్‌ పెంపకంపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి అప్పలరాజు కమిషనర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌కు ఆదేశాలు జారీ చేయగా జిల్లా అధికారులు ప్రకాశం జిల్లాలోని చెరువులపై వెంటనే దాడులు చేసి క్యాట్ ఫిష్ పెంచుతున్న చెరువులను గుర్తించారు. మంగళవారం నుండి ఆయా చెరువులను ధ్వంసం మొదలుపెట్టిన మత్య్సశాఖ అధికారులు బుధవారం రెండో రోజు కొనసాగించారు. ఊబచెత్తపాలెంలోని క్యాట్ ఫిష్ పెంచే 64 ఎకరాల చెరువులను జేసీబీలతో ధ్వంసం చేసి బ్లీచింగ్ చేశారు.

మరికొన్ని చోట్ల చెరువులలోని క్యాట్ ఫిష్ ను గుంతలలోకి మళ్లించి బ్లీచింగ్ చల్లి పూడ్చిపెట్టారు. క్యాట్ ఫిష్ సాగు చేస్తున్న నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన అధికారులు మరోసారి సాగు చేపడితే క్రిమినల్ కేసులు వంటి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. క్యాట్ ఫిష్ మాత్రమే కాకుండా పర్యావరణానికి, స్థానిక మత్స్యజాతులకు ముప్పు కలిగిస్తాయని నిషేధం విధించిన ఏ విదేశీ రకాలను పెంచిన కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు.