Tata Steel plant: 110 మీటర్ల ఎత్తున్న చిమ్నీ టవర్ క్షణాల్లో ఎలా కూలిందో చూడండి.. వైరల్ వీడియో

టాటా స్టీల్ ప్లాంట్‪లో 110 మీటర్ల ఎత్తున్న చిమ్నీని ప్లాంట్ అధికారులు ఆదివారం కూల్చేశారు. 27 ఏళ్ల క్రితం నిర్మించిన దీనిని 11 సెకండ్లలోనే కూల్చేశారు. ఈ వీడియోను సంస్థ ట్వీట్ చేసింది.

Tata Steel plant: 110 మీటర్ల ఎత్తున్న చిమ్నీ టవర్ క్షణాల్లో ఎలా కూలిందో చూడండి.. వైరల్ వీడియో

Tata Steel plant: టాటా స్టీల్ ప్లాంట్‪లో 27 ఏళ్ల క్రితం నిర్మించిన చిమ్నీ (పొగ గొట్టం)ని ఫ్యాక్టరీ సిబ్బంది ఆదివారం కూల్చివేశారు. 110 మీటర్ల ఎత్తున్న ఈ టవర్ 11 సెకండ్లలోనే నేలమట్టం అయింది. దీనికి సంబంధించిన వీడియోను టాటా సంస్థ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

Andhra Pradesh: అమరావతి కేసు.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

ఝార్ఖండ్, జంషెడ్‌పూర్‌లో ఉన్న టాటా స్టీల్ ప్లాంట్‌లో 27 ఏళ్ల క్రితం ఒక చిమ్నీ నిర్మించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో మార్పులు చేస్తున్న కారణంగా ఈ చిమ్నీని కూల్చివేయాలని ప్లాట్ అధికారులు నిర్ణయించారు. అయితే, ఇది ప్లాంట్ మధ్యలో ఉండటంతో దీన్ని కూల్చేందుకు అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టుపక్కల ఎలాంటి నష్టం జరగకుండా కూల్చాలనుకున్నారు. దీని కోసం దక్షణాఫ్రికాకు చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. ఈ సంస్థ ఇటీవల నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చింది. దీంతో టాటా ప్లాంట్‌లోని చిమ్నీని కూల్చే బాధ్యతను కూడా ఈ సంస్థకే అప్పగించారు. దీంతో రిహార్సల్‌లో భాగంగా సమీపంలోని ఒక రిపేర్ షాపును కూల్చారు.

Delhi Murder: శ్రద్ధా తరహాలో మరో హత్య.. భర్త శవాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య

ఇది సక్సెస్ కావడంతో టాటా చిమ్నీని కూల్చేందుకు సిద్ధమయ్యారు. ఇది 110 మీటర్ల ఎత్తు ఉండటంతో ఎవరికీ, ఎలాంటి హానీ జరగకుండా.. పూర్తి రక్షణ మధ్య దీన్ని కూల్చారు. మొత్తం 11 సెకండ్లలోనే ఈ చిమ్నీ టవర్ కూలిపోయింది. నిర్దేశిత ప్రదేశంలోనే టవర్ కూలినట్లు టాటా స్టీల్ ప్లాంట్ నిర్వాహకులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.