TN : ప్రభుత్వాసుపత్రుల్లో పని చేయరా ? అయితే..రూ. 50 లక్షలు ఫైన్ కట్టండి

ఒప్పందం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే...పని చేసేందుకు నిరాకరించిన 112 మంది వైద్యులపై భారీ జరిమాన విధించాలని వైద్య విద్య శాఖ నిర్ణయించింది.

TN : ప్రభుత్వాసుపత్రుల్లో పని చేయరా ? అయితే..రూ. 50 లక్షలు ఫైన్ కట్టండి

Tn

TN Doctors  : వైద్యో నారాయణ హరి అంటుంటారు పెద్దలు. కనిపించని దేవుళ్ల కన్నా ప్రాణం పోసే డాక్టర్లను దేవుళ్లగా భావిస్తుంటాటారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తుంటాయి. రెక్కాడితే డొక్కాడని చాలా మంది ప్రభుత్వాసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. అయితే..కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి.

Read More : COVID-19 ఇన్ఫెక్షన్.. అత్యంత తీవ్రమైన మహమ్మారిగా ఎప్పుడు మారుతుందంటే?

అక్కడకు వచ్చే రోగులకు చికిత్స అందించేందుకు సరిపడా వైద్యులు ఉండడం లేదు. కొంతమంది వైద్యులు ప్రైవేటు క్లినిక్ లు తెరుస్తూ…డబ్బులను ఆర్జిస్తుంటారు. ఈ క్రమంలో…కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుంటుంటాయి. తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాల్సి ఉంటుందని షరతులు పెడుతుంటాయి. ఈ ఒప్పందం ప్రకారం తప్పనిసరిగా గవర్నమెంట్ హాస్పిటల్ లో వారు చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే..ఒప్పందానికి నిరాకరించిన వైద్యులపై చెన్నై వైద్య విద్యాశాఖ కన్నెర్ర చేసింది. భారీ జరిమాన విధించడం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ అయ్యింది.

Read More : AP Govt : పదో తరగతిలో గ్రేడ్స్ లేవ్, గ్రేడ్ పాయింట్లు లేవ్…పాత పద్ధతే

అక్కడ వైద్యులతో ఓ ఒప్పందం కుదుర్చుకొంటోంది. ఒప్పందం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే…పని చేసేందుకు నిరాకరించిన 112 మంది వైద్యులపై భారీ జరిమాన విధించాలని వైద్య విద్య శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఒక్కొక్కరు రూ. 50 లక్షలు జరిమాన చెల్లించాలని వైద్య విద్యాశాఖ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది.

Read More : Teaching Hospitals : ప్రభుత్వ ఆసుపత్రులు మరింత బలోపేతం, రాష్ట్రంలో మరో 16 టీచింగ్ హాస్పిటల్స్.. సీఎం జగన్

రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాలల్లో మూడేళ్ల పాటు వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత…డాక్టర్లు విధిగా రెండేళ్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనను అతిక్రమిస్తే…రూ. 50 లక్షల జరిమాన చెల్లించాల్సి ఉంటుందని లిఖితపూర్వకంగా హామీ తీసుకుంటారు. 2020-21లో ప్రత్యేక వైద్య విద్యను అభ్యసించిన వారిలో 112 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసేందుకు నో చెప్పారు. ఒప్పందం ప్రకారం వారి నుంచి తలా రూ. 50 లక్షలు వసూలు చేయాలని వైద్య విద్య శాఖ..వైద్య కళాశాలల ప్రిన్స్ పాళ్లను ఆదేశించింది. వారు ఇచ్చే సంజాయిషీని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాళ్లు వెల్లడించారు. మరి వారు జరిమాన చెల్లిస్తారో…లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించేందుకు ఒకే చెబుతారో చూడాలి.