కైలాష్ మానసరోవర్ యాత్ర ఇక ఈజీ…కొత్త రోడ్డు మార్గంపై నేపాల్ అభ్యంతరాలను తోసిపుచ్చిన భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2020 / 07:42 AM IST
కైలాష్ మానసరోవర్ యాత్ర ఇక ఈజీ…కొత్త రోడ్డు మార్గంపై నేపాల్ అభ్యంతరాలను తోసిపుచ్చిన భారత్

తక్కువ సమయంలోనే భారతీయులు టిబెట్ భూభాగంలో ఉన్న కైలాష్-మానససరోవర్ యాత్రను పూర్తి చేసే అవకాశం ఇప్పుడు కొత్త మార్గం ద్వారా కలిగింది. గత శుక్రవారం భారత రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఉత్తరాఖండ్ నుంచి కైలాష్ మానససరోవర్ చేరుకునేలా 80కిలోమీటర్ల కొత్త రోడ్డు మార్గాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ లోని ఫితోర్ ఘర్ జిల్లాలోని ధార్చుల నుండి లిపులేఖ్ (చైనా సరిహద్దు) ను కలుపుతూ రహదారి మార్గాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ మంత్రి శ్రీ రాజనాధ్ సింగ్ ప్రారంభించారు.

ఈ రహదారి దార్చులాలోని ఘటిభగర్ ప్రాంతం నుండి ప్రారంభమై కైలాష్-మానససరోవర్ ప్రవేశ ద్వారమైన లిపులేఖ్ పాస్ వరకు ఉంటుంది. ఇది 80 కిలోమీటర్ల రహదారి. సముద్ర మట్టానికి 6,000 నుండి 17,060 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తవడంతో, కఠినతరమైన ఎత్తైన భూభాగం గుండా కష్టతరమైన పర్వతారోహణను ఇప్పుడు కైలాష్-మానససరోవర్ యాత్ర యాత్రికులు నివారించవచ్చు. ఈ కీలకమైన మార్గం పూర్తి కావడంతో స్థానికలు, యాత్రికుల దశాబ్దాల కల సాకారమైందని శ్రీ రాజనాధ్ సింగ్ తెలిపారు.

హిందూ, బుద్ధ, జైనులకు పవిత్రమైన కైలాష్-మానససరోవర్ మార్గం పూర్తి కావడం వల్ల ఇక నుండి ఈ యాత్రను  2-3 వారాల కాకుండా ఒక వారానికే పూర్తి చేయవచ్చని శ్రీ రాజనాధ్ సింగ్ తెలిపారు. ఇప్పటిదాకా సిక్కిం లేదా నేపాల్ మార్గాల వెంబడి కైలాష్-మానససరోవర్ యాత్ర రెండు మూడు వరాల పాటు సాగేది. 90 కిలోమీటర్ల నడవాల్సి వచ్చేది. దీని వల్ల వయోవృద్దులకు ఇబ్బందులు ఎదురయ్యేవి.  ఇప్పటి వరకు ఉన్న మార్గాల వల్ల భారత భూభాగం లో 20 శాతం, చైనా భూభాగంలో 80 శాతం యాత్ర చేయాల్సి ఉండేది.

ఇపుడు ఘటిభగర్-లిపులేఖ్ మార్గం వల్ల యాత్ర చాలా సులభం అయింది, మానససరోవర్ యాత్ర ఇక నుండి 84 శాతం భారత భూభాగం, 16 శాతం చైనా భూభాగం నుండి చేయవచ్చు. ఇది నిజంగా ఒక చారిత్రకమని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. 1962 సినో-ఇండియన్ వార్ కారణంగా భారత ప్రభుత్వం లిపులేఖ్ ను 1962నుంయి 1991వరకు మూసివేసిన విషయం తెలిసిందే.

నేపాల్ వాదనను కొట్టిపారేసిన భారత్

అయితే భారత్ ప్రారంభించిన కొత్త మార్గంపై నేపాల్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. లిపులేఖ్ పాస్ తమ భూభాగంలోదంటూ నేపాల్ ఆరోపిస్తోంది. సుగౌలి ఒప్పందం(1816)ప్రకారం…లింపియాదుర్గ మరియు లిపులేఖ్ తో సహా కాలి(మహాకాలి)నది తూర్పు ప్రాంతాలన్నీ నేపాల్ కే చెందుతాయని నేపాల్ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే నేపాల్ వాదనను భారత్ కొట్టిపారేసింది. లిపులేఖ్ ప్రాంతం పూర్తిగా భారత భూగాంలోనిదేనని సృష్టం చేసింది. ఇప్పటివరకు లిపులేఖ్ ఇండియా మ్యాప్ లోనే ఉంది. ఇప్పటివరకు నేపాల్ ఈ విషయంపై ఎప్పుడూ బహిరంగంగా నిరసన వ్యక్తం చేయలేదు. లిపులేఖ్ భారత్ కే చెందుతుందని చైనా కూడా అంగీకరించింది. అందుకే భారత్ నుంచి టాబెట్  కు రైట్ కు ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు.

Read Here>> లాక్‌డౌన్ ఎత్తేస్తున్నారా? ఐదోసారి సీఎంలతో మోడీ ఏం చర్చిస్తారంటే?