తండ్రి పాడె మోసి..చితికి నిప్పంటించిన 12 మంది కూతుళ్లు..

తండ్రి పాడె మోసి..చితికి నిప్పంటించిన 12 మంది కూతుళ్లు..

12 daughters gave shoulde to father’s body and performs last rights : హిందూ సంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే కర్మకాండలన్నీ కొడుకులే చేస్తారు. కొడుకులు లేకపోతే కొడుకులు లేకపోతే అన్నదమ్ములుగానీ వారి కొడుకులు గానీ లేదా వారి తరపు బంధువులు చేస్తారు. కానీ కాలం మారుతోంది. కొడుకులు లేనివారికి కూతుళ్లే కొడుకుల్లా మారి కర్మకాండలు చేస్తున్నారు. కానీ తండ్రి చనిపోతే అతనికి ఉన్న 10మంది కూతుళ్లు కొడుకుల్లా తండ్రి కర్మకాండలు చేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. 12 మంది కుమార్తెలు తమ తండ్రి పాడె మోసి, దహన సంస్కారాలు నిర్వహించారు.

12 daughters gave shoulde to father's body and performs last rights

మహారాష్ట్రలోని వాషీమ్ జిల్లా షెందుర్జన్‌ గ్రామానికి చెందిన సఖారామ్ గణపతిరావు కాలే తన 92 ఏట కన్నుమూశారు. ఆయనకు 12 మంది కూతుళ్లు. కొడుకులు లేరు. సఖారామ్ గణపతిరావు గత గురువారం (జనవరి 28)న కన్నుమూశారు. కొడుకులు లేకపోవటంతో ‘‘కర్మకాండలు ఎవరు చేస్తారో ఏంటో..పున్నామ నరకం నుంచి తప్పించటానికి ఒక్క కొడుకు లేడు కదా..పాపం’’అంటూ బంధువులంతా గుసగుసలాడుకున్నారు. అది విన్న గణపతిరావు కూతుళ్లకు బాధవేసింది. ‘‘మానాన్నకు కొడుకులు లేకపోతే ఏంటీ..మేం 12మంది కూతుళ్లం ఉన్నాం..మా నాన్నకు అన్ని కర్మకాండలు మేమే చేస్తాం’’అన్నారు. దీంతో బంధువులంతా షాక్ అయ్యారు..

దీంతో ఆయన కూతుళ్లు ‘మానాన్న బతికున్నన్నాళ్లు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. ఎంతోమందికి ఎన్నో విషయాల్లో అవగాహన కల్పించారు. అటువంటి మా నాన్నకు మేం చేస్తే తప్పేంటి? అన్నారు.దానికి బంధువులు కూడా నిజమే కదా అని వారికి సహకారం అందించి దగ్గరుండి మరీ అన్నీ కార్యక్రమాలు జరిపించారు.

సెప్టెంబరు 14, 1930లో జన్మించిన గణపతిరావు..పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారు. వృద్ధాప్యం..పైగా అనారోగ్య సమస్యలు రావటం..ఆరోగ్యం విషమించటంతో గత గురువారం సాయంత్రం తుదిశ్వాస విడించారు. అనంతరం శుక్రవారం ఆయన అంత్యక్రియలకు ఊరు ఊరంతా వచ్చారు. గణపతిరావు 12 మంది కుమార్తెలు తండ్రి పాడె మోసి శ్మశానానికి తీసుకెళ్లారు.అనంతరం అక్కడ నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలు స్వయంగా 12మంది నిర్వహించి..చివరకు తండ్రి చితికి అందరూ కలిసి నిప్పంటించారు.

అంత్యక్రియలు పూర్తయిన తర్వాత గణపతిరావు కుమార్తెలు మాట్లాడుతూ.. తాము దహన సంస్కారాలు నిర్వహించి, తమ తండ్రి చివరి కోర్కెను నెరవేర్చామని..మా నాన్న మమ్మల్ని కొడుకులు లేరని ఎప్పుడు బాధపడలేదనీ..సామాజికంగా చాలా పరిపక్వత కలిగిన వ్యక్తి అని తెలిపారు. వారిలో భాగ్యశ్రీ అనే కూతరు మాట్లాడుతూ..మేం 12మంది అక్కాచెల్లెళ్లం..మేమంతా కలిసి మా తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాం..కొడుకులకు కూతుళ్లు ఏమీ తక్కువకాదని అందరూ తెలుసుకోవాలని సూచించారు. గణపతిరావుకు కుమార్తెలు ఆయనకు ఏమీ తక్కువ కాకుండా అంత్యక్రియలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకున్నారని..కొడుకులే కాదు కూతుళ్లు కూడా కర్మకాండలను చేయలగరని నిరూపించారని గ్రామస్థులు ప్రశంసించారు.

కాగా గతంతో మహారాష్ట్రలోని బీడ్ జిల్లాల్లో కొద్ది రోజుల కిందట ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. తమ అత్తకు కోడళ్లు అంత్యక్రియలు నిర్వహించారు. నలుగురు కోడళ్లూ కర్మకాండలు చేశారు. సుందర్‌బాయ్ నాయిక్‌వాడే అనే 80 ఏళ్ల మహిళ అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా.. తమను తల్లిలా చూసుకున్న అత్తకు కోడళ్లు అంత్యక్రియలు నిర్వహించి తమ ప్రేమను చాటుకున్నారు.