Swine Flu: స్వైన్‌ఫ్లూతో బాలిక మృతి.. చికిత్స తీసుకుంటున్న కవల సోదరి

కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన అంటువ్యాధి స్వైన్‌ఫ్లూ. కొంతకాలంగా దేశంలో స్వైన్‌ఫ్లూ కేసులు పెద్దగా నమోదు కాలేదు. అందులోనూ మరణాలు ఇంకా తక్కువ. అయితే, తాజాగా కేరళలో స్వైన్‌ఫ్లూ మరణం నమోదైంది.

Swine Flu: స్వైన్‌ఫ్లూతో బాలిక మృతి.. చికిత్స తీసుకుంటున్న కవల సోదరి

H1n1

Swine Flu: కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన అంటువ్యాధి స్వైన్‌ఫ్లూ. కొంతకాలంగా దేశంలో స్వైన్‌ఫ్లూ కేసులు పెద్దగా నమోదు కాలేదు. అందులోనూ మరణాలు ఇంకా తక్కువ. అయితే, తాజాగా కేరళలో స్వైన్‌ఫ్లూ మరణం నమోదైంది. పన్నెండేళ్ల బాలిక స్వైన్‌ఫ్లూతో మరణించింది. కోజికోడ్ జిల్లాలోని ఉల్లియెరి ప్రాంతానికి చెందిన బాలిక స్వైన్‌ఫ్లూ కారణంగా గత ఆదివారం మరణించింది.

Punjab: సిద్ధూ హత్యతో దిగొచ్చిన ఆప్ సర్కారు.. వీవీఐపీలకు భద్రత కొనసాగింపు

బాలిక కవల సోదరికి కూడా స్వైన్‌ఫ్లూ సోకగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇటీవల బెంగళూరు నుంచి బాలికలు కేరళ తిరిగి వచ్చారు. అప్పుడే బాలికలో స్వైన్‌ఫ్లూ వంటి లక్షణాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు ముందుగా కొలియండీ తాలూకా ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండటంతో తర్వాత కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బాలిక మరణం తర్వాత అందిన నివేదికలో స్వైన్‌ఫ్లూనే దీనికి కారణమని తేలింది. మరణించిన బాలిక కవల సోదరి ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. హెచ్1ఎన్1గా పిలిచే వైరస్ కారణంగా వచ్చే వ్యాధిని స్వైన్‌ఫ్లూ అంటారు.

Tomato prices: టమాటా ధరలు రెండు వారాల్లో తగ్గొచ్చు: కేంద్రం

ఇది అంటువ్యాధి. రోగుల నోటి నుంచి వెలువడ్డ తుంపరల ద్వారా గాలిలోకి వ్యాపించి, వేరొకరికి అంటుకుంటుంది. 2009లో ఈ వ్యాధి అనేక దేశాలకు వ్యాపించింది. అప్పట్లో ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసింది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 2,84,500 మంది మరణించారు. అనధికారికంగా అంతకంటే ఎక్కువే మరణించి ఉండొచ్చని అంచనా.