Gang Rape : 13 ఏళ్ల బాలిక కిడ్నాప్-కొరియా తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్

13 ఏళ్ల బాలికను  కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన చత్తీస్ గఢ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. 

Gang Rape : 13 ఏళ్ల బాలిక కిడ్నాప్-కొరియా తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్

Gang Rape

Gang Rape :  13 ఏళ్ల బాలికను  కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన చత్తీస్ గఢ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.  కొర్బా జిల్లా  మనేంద్రగఢ్ లోని   మౌహార్పూరకు చెందిన ముగ్గురు నిందితులు   13 ఏళ్ళ బాలికను జులై 11వ తేదీన… ఇంటి ముందు ఆడుకుంటుండగా కిడ్నాప్ చేశారు.

అక్కడి నుంచి బాలికను   190 కిలోమీటర్లు దూరంలోని   కొరియా జిల్లాకు తీసుకు  వెళ్లారు. అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెపితే  చంపేస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా జులై 14న   బాలికను చైన్ పుర్   ప్రాంతంలోని ఓ గోదాము వద్దకు తీసుకు వెళ్లి అక్కడ కారులో మళ్లీ అత్యాచారం చేశారు.

నిందితుల   చెరనుంచి తప్పించుకున్న బాలిక ఎలాగోలా తల్లితండ్రుల వద్దకు చేరింది. వారికి జరిగిన విషయం అంతా చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని   వారిపై ఐపీసీ సెక్షన్ 363, 376 , మరియు  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టాల కింద కేసులు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టుబడ్డ నిందితుల్లో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు.

Also Read : Chhattisgarh : మద్యం తాగి స్కూలు వచ్చిన మహిళా టీచర్