భార్యను వదిలేసి, యువ గాయనితో మ్యూజిక్ డైరెక్టర్ సహజీవనం

గోపీ సుందర్. మ్యూజిక్ డైరెక్టర్. దక్షిణాదిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు.

  • Published By: naveen ,Published On : May 15, 2020 / 07:14 AM IST
భార్యను వదిలేసి, యువ గాయనితో మ్యూజిక్ డైరెక్టర్ సహజీవనం

గోపీ సుందర్. మ్యూజిక్ డైరెక్టర్. దక్షిణాదిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు.

గోపీ సుందర్. మ్యూజిక్ డైరెక్టర్. దక్షిణాదిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు. మలయాళం సినిమాలతో సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గోపీ సుందర్ టాలీవుడ్ లోనూ తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’తో టాలీవుడ్‌లో మ్యూజిక్‌ కంపోజర్‌గా అరంగేట్రం చేసిన గోపీ.. ‘గీతా గోవిందం’ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. కాగా, తాజాగా ఆయన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ చర్చకు దారితీసింది. గోపీ సుందర్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

‘నా ఉనికికి నువ్వే కారణం’ అంటూ హిరన్మయితో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు గోపీ సుందర్‌. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రియ అనే యువతితో 2001లో గోపీ సుందర్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మనస్పర్థలు తలెత్తడంతో గోపీ సుందర్‌ తన భార్య నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. విడాకులకు ఆయన భార్య ప్రియ కూడా సమ్మతంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యువ గాయని అభయ హిరన్మయితో గోపీ సుందర్‌ ప్రేమలో పడ్డాడు. గోపీ-హిరన్మయిలు తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని వేర్వేరు సందర్భాల్లో వీరిద్దరూ అధికారికంగా తెలిపారు. 

భార్యకి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన గోపీ సుందర్ యువ సింగర్ అభయ హిరన్మయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. దీనిపై పలు రూమర్లు వస్తున్న తరుణంలో ఈ సంగీత దర్శకుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం తన మొదటి భార్య విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని, తాను అభయతో ప్రేమలో ఉన్నట్లు చెప్పాడు.

Read Here>> దటీజ్ ఉపాసన: పేడ ఎత్తుతూ..కుడితి కలుపుతూ..లాక్ డౌన్ లో బిజీ బిజీ