లాక్‌డౌన్ వల్లే ప్రాణాలతో ఉన్నాం.. 78వేల మందిని కాపాడుకున్నాం!

  • Published By: srihari ,Published On : May 23, 2020 / 11:00 AM IST
లాక్‌డౌన్ వల్లే ప్రాణాలతో ఉన్నాం.. 78వేల మందిని కాపాడుకున్నాం!

లాక్‌డౌన్‌తో ప్రయోజనం ఏంటి.. లక్షమందికి పైగా కరోనా సోకిందనే మాట వినిపిస్తోంది. మరోవైపు.. తొలి రెండు విడతల లాక్‌డౌన్ అమలు చేయడం వల్లే 14 లక్షల నుంచి 29 లక్షల కొవిడ్-19 కేసులు నమోదు కాకుండా అడ్డుకుందని, ఈ సమయంలోనే కనీసం 37వేల నుంచి 78వేల ప్రాణాలు పోకుండా కాపాడుకున్నామని  కేంద్రం చెప్తోంది.. లాక్‌డౌనే లేకుండా ఉంటే కనీసం పద్నాలుగు లక్షలమందికి కోవిడ్ 19 సోకేదని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇండియన్ స్టాటికల్ ఇన్సిట్యూట్ ప్రకటించింది.. ఇదే నిజమైతే భారత్ పెద్ద ప్రమాదాన్నే తప్పించుకుందని చెప్పాలి. లాక్‌డౌన్ అమలు అవుతున్న నాటి నుంచి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేస్తోన్న కేంద్ర గణాంక సంస్థ తాజాగా వెలువరించిన అంచనా ప్రకారం… లాక్‌డౌన్‌తోనే లక్షలాదిమంది వైరస్ బారిన పడకుండా కాపాడబడినట్లు చెప్తోంది.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మోడల్ ప్రకారం.. లాక్‌డౌన్ విధించడం వలనే .. లక్షా 20వేల నుంచి రెండులక్షల పదివేల మంది ప్రాణాలు నిలబడినట్లు ఇండియన్ స్టాటికల్ ఇన్సిట్యూట్  ప్రకటించింది. అలానే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం వల్లనే 36 నుంచి 70లక్షలమందికి కరోనా సోకకుండా ఉందని చెప్పింది. సర్వే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మోడల్‌లో మొదటి అంచనా ప్రకారం.. ఈ లెక్క చెప్తున్నట్లు ఐఎస్ఐ సంస్థ వెల్లడించింది. 

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మోడల్‌లోనే అనేక అంచనాలను బట్టి మొత్తంగా భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా లాక్‌డౌన్ వల్లనే అడ్డుకున్నట్లు తేల్చింది. లేదంటే కనీసం పద్నాలుగు లక్షల నుంచి 29 లక్షలమందికి వైరస్ సోకి ఉండేదని యావరేజ్‌న అంచనా వేసింది BCG మోడల్. అలానే ఈ భారీ సంఖ్యలో 37వేల నుంచి 78వేల వరకూ మరణాలు సంభవించి ఉండేవంటూ BCG సంస్థ మోడల్స్ అంచనా ప్రకారం తెలుస్తోంది. వీటికి సంబంధించి లెక్కలనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 

బిసిజి మోడల్ నంబర్ టూ ప్రకారం.. 23లక్షలమందికి వైరస్ సోకి.. 68వేలమంది చనిపోయి ఉండేవారని తేలింది. రెండో మోడల్ ప్రకారం.. 15లక్షల 90వేలమంది వైరస్ బారిన పడి ఉండేవారని.. 51వేల మరణాలు భారత్‌లో సంభవించేవని BCG ప్రకటించింది. ఈ అధ్యయనాలతో పాటు కేంద్ర గణాంగ మంత్రిత్వశాఖ.. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్సిట్యూట్ జాయింట్‌గా చేపట్టిన స్టడీలో లాక్‌డౌన్ లేకపోతే 20లక్షలమందికి వైరస్ సోకి ఉండేదని 54 వేలమంది చనిపోయేవారని తేలింది. 

మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా లాక్‌డౌన్ విధించడం వృధా కాదని.. దేశమంతా ఆరోగ్యవ్యవస్థని సన్నద్ధం చేయడంలో.. మౌలిక వసతులు కల్పించడంలో ఈ 60 రోజుల సమయం బాగా వినియోగించుకున్నట్లు ప్రకటించింది. దేశంలో లక్ష కేసులకి  పైగా నమోదు కాగా.. అసలు లాక్‌డౌన్‌తో సాధించిందేంటనే విమర్శలు వచ్చాయి. వాటికి చెక్ పెట్టేందుకే కేంద్రం ఇలా గణాంకాలు విడుదల చేసిందని తెలుస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా మార్చి 25న కేంద్రం లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పడు నాలుగో దశ లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా కొవిడ్ మరణాలు రేటు పడిపోయింది. లాక్ డౌన్ ముందు.. తర్వాత పరిస్థితుల్లోనూ గుర్తించదగిన వ్యత్యాసం కనిపిస్తోందని NITI అయోగ్ (హెల్త్) సభ్యులు డాక్టర్ వి.కె పాల్ తెలిపారు. పబ్లిక్ హెల్త్ ఫాండేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. దాదాపు 78వేల మంది ప్రాణాలను లాక్ డౌన్ తోనే కాపాడుకున్నామని శ్రీవాస్తవ తెలిపారు. 

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో గురువారం వరకు 80శాతానికి పైగా యాక్టివ్ కేసులు నమోదైనట్టు పాల్ తెలిపారు. 10 రాష్ట్రాల్లో మాత్రం 90శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ఇతర దేశాల భారీ కేసులతో పోలిస్తే గత రెండు నెలల్లో దేశంలోని కేసుల సంఖ్య భారీగా పెరిగినట్టు తెలిపారు. ఇదే ఐదు రాష్ట్రాల్లోనూ 80 శాతం మేర మరణాలు నమోదు కాగా, మిగతా 10 రాష్ట్రాల్లోనూ 95 శాతం మేర మరణాలు నమోదు అయినట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్రాలకు 30 లక్షల PPE కిట్లను పంపణి చేయగా.. 109 డొమస్టిక్ మ్యానిఫ్యాక్చర్ లలో రోజుకు 3 లక్షల పీపీఈ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు చెప్పారు. 

ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మరణాల రేటు తక్కువగానే ఉందని, ఒక మిలియన్ కు 2.13 మరణాలు నమోదు కాగా.. చైనాలో ఒక మిలియన్ మందికి 3.34 మరణాలు, యూకేలో 519 మరణాలు నమోదైనట్టు పాల్ వెల్లడించారు. మే 19 నాటికి దేశంలో కొవిడ్-19 మరణాల రేటు 3.13శాతానికి పడిపోయిందని, కంటైన్మెంట్ చర్యలు, క్లినికల్ మేనేజ్ మెంట్ కేసులపై దృష్టిపెట్టడంతోనే ఈ సాధ్యపడిందని చెప్పారు. మే 22, శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు కొవిడ్-19 కోసం 27,55, 714 మందికి పరీక్షలు చేసినట్టు ICMR అధికారి ఒకరు వెల్లడించారు. ఒక రోజులో 1,03, 829 మందికి టెస్టులు చేసినట్టు పేర్కొంది. గత నాలుగు రోజుల్లో ప్రతి రోజుకు కొవిడ్ పరీక్షలను ఒక లక్ష వరకు నిర్వహించినట్టు అధికారి తెలిపారు. 

Read: RSS సిగ్గుపడాలి…ప్రభుత్వానికి RBI ఆ మాట చెప్పాలన్న చిదంబరం