2020 : ఇండియా మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్స్

2020 : ఇండియా మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్స్

15 Of The Most Powerful Women In India : భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మహిళలు పలు రంగాల్లో రాణిస్తున్నారు. తమ ప్రతిభా పాటవాలను కనబరుస్తున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితం అయిన మహిళలు తమ ప్రతిభతో సమాజంలో అంచెలంచెలుగా ఎదుగుతూ పితృస్వామ్య సిద్ధాంతాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నతస్థాయిలకు చేరుకుంటున్నారు. నింగీ నేలా మాదేనంటు ఆకాశంలో కూడా గెలుపు సంతకాలు చేస్తున్నారు.

India most powel full womens

సంప్రదాయాల సంకెళ్లు తెంచుకుని స్వేచ్చావాయువులు పీలుస్తూ..ప్రతిభతో ఎదుగుతున్నారు. ఆడవారంటూ బలహీనులు కాదు బలవంతులని నిరూపిస్తున్నారు. బిలియన్ డాలర్ల కంపెనీలల్లో కీలకంగా వ్యవహరిస్తు సీవోల స్థాయిల్లో కంపెనీలను విజయతీరాలవైపు నడిపిస్తున్నారు. స్టార్టప్ లతో మొదలై కోట్ల టర్నోవర్లకు చేరుకుంటూ అటు కుటుంబాలను ఇటు వ్యాపారాలను సమర్థవంతంగా నడిపిస్తున్నా మహిళలు ఎంతోమంది ఉన్నారు. రాజకీయాల్లో..వ్యాపారాల్లో..దేశం కోసం పోరాడే వీర వనితలుగా రాణిస్తున్నారు.

భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ నుండి, ఫోర్బ్స్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల లిస్టులో 15మంది భారతీయ మహిళలు కావటం విశేషం. మరి 2020 శక్తివంతమైన 15మంది భారతీయ స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ ఎవరో చూద్దాం..

              

దివ్య గోకుల్‌నాథ్
ఫోర్బ్స్ ఆసియా శక్తివంతమైన వ్యాపార మహిళగా 2020 లో శక్తివంతమైన లిస్టులో స్థానం దక్కించుకున్నారు. దివ్య గోకుల్నాథ్ బైజు సహ వ్యవస్థాపకురాలు. ఎడ్-టెక్ స్టార్టప్ తో ఆమె భర్త బైజు రవీంద్రన్ నికర విలువను 3 బిలియన్ డాలర్లకు నెట్టివేసి శక్తివంతమైన మహిళ అయ్యారు.

అమీరా షా
అమీరా షా మెట్రోపాలిస్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్. ఫోర్బ్స్ ఆసియా యొక్క శక్తివంతమైన వ్యాపారవేత్తల లిస్టులో 2020 లో ఆమె భారతీయ మహిళలలో ఒకరిగా నిలిచారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా తన వ్యాపారాన్ని రాణింపజేసిన స్ట్రాంగెస్ట్ ఉమెన్ అమిరా షా.


షైలాజా అకా శైలాజా
కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కెకె షైలాజా అకా శైలాజా. సాధారణ టీచర్ నుంచి మంత్రిగా ఎదిగిన మహిళ. యుకెకు చెందిన ప్రాస్పెక్ట్ మ్యాగజైన్ కోవిడ్ -19 ఏజ్ ప్రపంచంలోని టాప్ 50 థింకర్స్ విజేతగా ఎంపికయ్యారు శైలజ. కరోనా వ్యాప్తిని ఎదుర్కోవడంలో కేరళ ఆరోగ్యశాఖా మంత్రిగా శైలజ అనుక్షణం అప్రమత్తంగా ఉండి కట్టడి చేశారు.నిరంతరం పర్యవేక్షణలో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద మీడియా సంస్థలు మంత్రి శైలజ తీసుకున్న ముందస్తు చర్యలు..నిబంధనలు..వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఆమె కృషి గురించి ప్రచురించాయి.

రానా అయూబ్
ముంబైకు చెందిన రానా ఆయుబ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ గా పలు అంశాలపై ఆమె చేసిన డేరింగ్ అండ్ డేషింగ్ వనితగా ఆమె ధైర్యసాహసాలను కనబరిచారు. దానికి గాను రానా అయూబ్ మెక్‌గిల్ అవార్డును అందుకున్నారామె. దీంతో ఆమె 2020 స్ట్రాంగెస్ట్ ఉమెన్ గా నిలిచారు. రానా అయూబ్ ప్రగతిశీల రచయితల ఉద్యమంలో ప్రధాన సభ్యురాలు.

రోష్ని నాదర్ మల్హోత్రా
36,800 కోట్ల రూపాయల నికర విలువ కలిగిన రోష్ని భారతదేశ సంపన్న మహిళ. ఫోర్బ్స్ ప్రకారం..ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో రోష్ని నాదర్ మల్హోత్రా 54 వ స్థానంలో నిలిచారు.


వినతి సరాఫ్ ముత్రేజా
వినాటి ఆర్గానిక్స్ లిమిటెడ్ (VOL) స్పెషాలిటీ కెమికల్ కంపెనీకి CEO. వినాటి తన తండ్రితో వ్యాపారంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరినప్పటి నుండి..కంపెనీని లాభాల బాటలో నడిపించారు. ఆమె బాధ్యతలు తీసుకున్ననాటి నుంచి రూ. 66 కోట్ల నుండి రూ.1,000 కోట్లకు పెంచారు. దీంతో వినాటి ఆర్గానిక్స్ పేరు మారుమ్రోగిపోయింది.

ఇసివానీ
ప్రపంచవ్యాప్తంగా బిబిసి ప్రకటించిన 100 స్ఫూర్తిదాయకమైన..ప్రభావవంతమైన మహిళలలో ఇసివానీ ఒకరిగా నిలిచారు. ది కాస్ట్ లెస్ కలెక్టివ్ ఏకైక మహిళా సభ్యురాలు.ఇసివానీ చెన్నైకి చెందిన సంగీత విద్వాంసుడు కాస్ట్లెస్ ఆర్ట్ గ్రూప్ లో ప్రముఖ గాయని. ఆమె ఘనా పాటలకు అనేక ప్రశంసలు అందుకుంది. ఇటువంటి పాటలు పురుషులు మాత్రమే పాడగలరు అనుకునేవారికి కాదని నిరూపించింది ఇసివానీ. తన పాటలతో తనకంటూ ఒక గుర్తింపుని సాధించుకున్నారు.

బిల్కిస్ బానో
బిల్కిస్ బానో ని షాహీన్ బాగ్ ‘దాది’ అని పిలుస్తారు. 80ఏళ్ల బిల్కిస్, టైమ్ మ్యాగజైన్ 2020 అత్యంత ప్రభావవంతమైన 100 మంది శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. షాహీన్ బాగ్ వద్ద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా రెండు నెలల సుదీర్ఘ కాలం పాటు రోజంతా నిరసనలు తెలిపారు. 80ఏళ్ల వయస్సులో బిల్కిస్ సంకల్పం ఆమెను స్ట్రాంగెస్ట్ ఉమెన్ గా నిలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ ఏక్ట్ కు వ్యతిరేకంగా నిరంతర నిరసనలతో ఇటు ప్రజలు..అటు ప్రభుత్వం దృష్టిని ఆకర్షించారు బిల్కిస్ బానో.


అంకితి బోస్
ఫ్యాషన్ రిటైలర్ల కోసం టెక్నాలజీ, కామర్స్ ప్లాట్‌ఫామ్ జిలింగో CEO అంకితి బోస్. తన ప్రతిభా పాటవాలతో 1 బిలియన్ డాలర్ల బిజినెస్ టర్నోవరర్ తో మొదటి మహిళా సహ వ్యవస్థాపకురాలిగా నిలిచారు. అంతేకాదు ఫోర్బ్స్ ఇండియా సెల్ఫ్ మేడ్ ఉమెన్ 2020 గా నిలిచారు.

మనసి జోషి
రాజ్ కోట్ లో పుట్టిన మనసి జోషి..మనసి జోషి 2019లో బాసెల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడంతో ఆమె ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. టైమ్ మ్యాగజైన్‌లో మనసీ జోషిని ‘నెక్స్ట్ జనరేషన్ లీడర్’ గా ప్రశంసించారు. ఇది పారా అథ్లెట్‌కు మొదటిది. ఆమె ఫోర్బ్స్ ఇండియా సెల్ఫ్ మేడ్ ఉమెన్ 2020 జాబితాలో కూడా ఉంది.

రితు కరిధల్
మార్స్ ఆర్బిటర్ మిషన్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్ అయినందున ఆమెను ‘రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా’ అని కూడా పిలుస్తారు. ఫోర్బ్స్ ఇండియా సెల్ఫ్ మేడ్ ఉమెన్ 2020 జాబితాలో చోటు దక్కించుకున్నారు రితు కకిధల్.

ప్రియాంక చోప్రా జోనాస్
ఫార్చ్యూన్ ‘ఇండియా మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ జాబితాలో ప్రియాంకా చోప్రా 2020 లో చోటు దక్కించుకుంది.


సీమా కుష్వాహా
సీమా కుష్వాహా ప్రముఖ న్యాయవాది. సీమా కుష్వాహా పేరు చెబితే మనకు ఠక్కుమని గుర్తుకొచ్చేది దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన నిర్భయ ఘటన. నిర్భయ అత్యాచారం, హత్య కేసును సీమా కుష్వాహ పట్టువదలకుండా, బెదిరింపులకు భయపడకుండా, ఆశలకు లొంగకుండా ఏడు సంవత్సరాలపాటు సుప్రీంకోర్టులో వాదించారు. నిర్భయ తల్లిదండ్రులతో కలిసి, న్యాయం కోసం పోరాడారు. నిందితుల్ని దోషులుగా నిరూపించి వారికి మరణ శిక్ష పడేంత వరకూ తన పోరాటాన్ని కొనసాగించారు సీమా కుష్వాహ. న్యాయాన్ని గెలిపించటానికి ఆమె చేసిన కఠినమైన పోరాటం చేశారు. అలా ఆమె భారతీయ శక్తివంతమైన మహిళా మారారు.


లెఫ్టినెంట్ జనరల్ మాధురి కనిత్కర్
మాధురి భారత చరిత్రలో మూడవ మహిళా లెఫ్టినెంట్ జనరల్. అంతేకాదు భారత సైన్యంలో రెండవ అత్యున్నత పదవిని సాధించిన మొదటి మహిళా శిశువైద్యురాలు.


మణిపూర్ మణిపూస బాలా దేవి
స్కాట్లాండ్‌కు చెందిన ఫుట్‌బాల్ క్లబ్ రేంజర్స్ ఎఫ్‌సీ తరఫున 18 నెలల పాటు ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి బాలా దేవి. ఒకప్పుడు భారత మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న బాలాదేవికి భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాల్ క్రీడాకారిణిగానూ రికార్డు ఉంది. బాలాదేవి భారత్ తరఫున 58 మ్యాచ్‌లు ఆడి 52 గోల్స్ చేశారు. దేశీయ పోటీల్లో 100కి పైగా గోల్స్ చేశారు. మణిపూర్ మణిపూస ఈ నంగొమ్ బాలాదేవి.

మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు చెందిన బాలాదేవి చిన్నప్పటినుంచి ఫుట్ బాల్ అంటే ప్రాణం. అబ్బాయిలతో కలిసి ఆడేది. ఆమె ఆటలో ఉంటే గోల్స్ అన్నీ ఆమె ఖాతాలోనే. ఆ ఇష్టంతోనే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుంటూ జాతీయ మహిళా ఫుడ్ బాల్ జట్టుకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంది. స్పోర్ట్స్ కోటాలో మణిపూర్ పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించింది. ఫుట్ బాల్ కే తన జీవితాన్ని అంకితంచేసింది. ఈ క్రమంలో దేశంలోనే మరే మహిళా ఫుట్ బాలర్ కు సాధ్యంకాని ఘనత సాధించింది. స్కాట్ లాండ్ చెందిన ప్రముఖ పుట్ బాల్ క్లబ్ ‘రేంజర్స్ ఫుట్ బాల్ క్లబ్’తో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా బాలా దేవి నిలిచింది. ‘రేంజర్స్ ఫుట్ బాల్ క్లబ్’ ఎంచుకున్న ప్రపంచ మేటి 14మంది క్రీడాకారిణుల్లో బాలాదేవి ఉండటం భారతదేశానికి గర్వకారణం. రేంజర్స్ తరపున కూడా తనకు బాగా అచ్చి వచ్చిన 10వ నంబరు జెర్సీలోనే బరిలోకి ఆటలో గోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ మణిపూర్ మణిపూస బాలాదేవి.