Shiv Sena: శివసేనలో ఇప్పుడు ఎంపీల వంతు.. ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి మ‌ద్దతు తెల‌పాల‌ని డిమాండ్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేకు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్న అంశంపై ఉద్ధ‌వ్ ఠాక్రే నిర్వ‌హించిన స‌మావేశంలో పాల్గొన్న 16 మంది లోక్‌స‌భ స‌భ్యులు ఎన్డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకే మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.

Shiv Sena: శివసేనలో ఇప్పుడు ఎంపీల వంతు.. ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి మ‌ద్దతు తెల‌పాల‌ని డిమాండ్

Uddav

Shiv Sena: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేకు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్న అంశంపై ఉద్ధ‌వ్ ఠాక్రే నిర్వ‌హించిన స‌మావేశంలో పాల్గొన్న 16 మంది లోక్‌స‌భ స‌భ్యులు ఎన్డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకే మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. ద్రౌప‌ది ముర్ము గిరిజ‌న మ‌హిళ అని, అందుకే ఆమెకే మ‌ద్ద‌తు తెలపాల‌ని తాము ఉద్ధ‌వ్‌కు చెప్పిన‌ట్లు శివ‌సేన ఎంపీ గ‌జాన‌న్ కిర్తికార్ మీడియాకు తెలిపారు.

salt: అద‌నంగా ఉప్పు తీసుకునే వారికి అకాల మ‌ర‌ణ ముప్పు

ఇప్ప‌టికే దాదాపు 40 మంది శివ‌సేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండేకు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. బీజేపీతో తిరిగి క‌ల‌వాల‌ని రెబ‌ల్ ఎమ్మెల్యేలు ముందుగా ఉద్ధ‌వ్ ఠాక్రేకు చెప్పారు. ఆ త‌ర్వాత బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు శివ‌సేన‌ ఎంపీలు కూడా ఎన్డీఏకు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని అంటున్నారు.