Mystery: వీడిన 160ఏళ్ల మిస్టరీ .. పాడుబడ్డ బావిలో పుర్రెలెవరివో తేలింది..

మిస్టరీ వీడింది.. ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ పుర్రెలు ఎవరివనేది తేలింది. ఎనిమిదేళ్ల క్రితం బయటపడ్డ మానవ పుర్రెలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవని ...

Mystery: వీడిన 160ఏళ్ల మిస్టరీ .. పాడుబడ్డ బావిలో పుర్రెలెవరివో తేలింది..

Mystery

Mystery: మిస్టరీ వీడింది.. ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ పుర్రెలు ఎవరివనేది తేలింది. ఎనిమిదేళ్ల క్రితం బయటపడ్డ మానవ పుర్రెలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవని హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), పంజాబ్ యూనివర్శిటీ, బీర్బల్ సాహ్ని ఇన్సిట్యూట్, బెనారస్ హిందూ యూనివర్శిటీకి చెందిన ఇతర పరిశోధకులతో కలిసి శాస్త్రవేత్తలు తేల్చారు. 2014లో పంజాబ్‌లోని అజ్‌నాలా పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో పెద్ద‌ఎత్తున మానవ పుర్రెలు లభ్యమయ్యాయి. అప్పటి నుంచి వీటిపై పరిశోధనలు జరుగుతుండగా, తాజాగా ఇవి 160ఏళ్ల నాటి మానవుల పెర్రెలు అని, ఇవి గంగానదీ పరీవాహక ప్రాంత ప్రజలవని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

Moon Mystery : చంద్రుడికి మరో ముఖం వుందా? నిండు జాబిలిపై ఆ మచ్చలేమిటి? సైన్స్‌ ఏం చెప్తోంది?

2014 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని అజ్‌నాలాలో పాడుబడ్డ బావిలో పెద్ద మొత్తంలో మానవ కపాలాలు బయటపడ్డాయి. అయితే వీటిని 1857 నాటి తిరుగుబాటులో బ్రిటిషర్ల చేతిలో హతమైన సిపాయిలవని కొందరు, కాదు 1947 నాటి దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో మరణించిన వారిని కావచ్చు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంజాబ్ యూనివర్శిటీకి చెందిన మానవ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్‌ జేఎస్‌ సెహ్రావత్‌, సీసీఎంబీ, లక్నోలోని బీర్బల్‌ సాహ్నీ ఇన్‌స్టిట్యూట్, బెనారస్‌ హిందూ యూనివర్సిటీలతో కలిసి ఈ పుర్రెల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సీసీఎంబీ పాడుబడ్డ బావిలో లభ్యమైన పుర్రెల నుంచి డీఎన్ఏను వెలికితీసి పరిశీలించగా మిస్టరీ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రచారంలో కథనాలేవీ కావని.. ఈ పుర్రెలు గంగా నదీ ప్రాంతానికి చెందిన వారని స్పష్టమైంది.

Mystery Disease‌ : అంతు చిక్కని వ్యాధితో కుప్పకూలిపోతున్న చిన్నారులు..ఐదు దేశాల్లో 100 కేసులు

ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం ఈ పుర్రెలు పంజాబ్, పాకిస్తాన్‌ ప్రాంతాల ప్రజలకు చెందినవి కానే కాదని, వీటి డీఎన్‌ఏ ప్రకారం.. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్‌ ప్రజల డీఎన్‌ఏతో సరిపోలుతోందని డాక్టర్ సెహ్రావత్ వివరించారు. 26వ బెంగాల్ నేటివ్ ఇన్ ఫాంట్రీ బెటాలియన్ లో బెంగాల్ తూర్పు ప్రాంతపు ప్రజలతో పాటు ఒడిషా, బిహార్, యూపీలకు చెందిన వారూ ఉండేవారని చరిత్ర చెబుతోందని వివరించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఆ బెటాలియన్ కు చెందిన సైనికులను ప్రస్తుత పాకిస్థాన్ ప్రాంతంలోని మియాన్ మీర్ ప్రాంతంలో నియమించారని, బ్రిటీష్ అధికారులపై తిరుగుబాటు క్రమంలో బ్రిటీష్ అధికారులు వీరిని అజ్‌నాలా సమీపంలో బంధించి చంపేసినట్లు చరిత్ర చెబుతోందని పరిశోధనల్లో తేలింది. అయితే ఈ పరిశోధనల్లో భాగంగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పరిశోధనలతో కీలక పాత్ర పోషించిన బెనారస్ హిందూ యూనివర్శిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్‌ చౌబే తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని చేరుస్తాయని ఇప్పటి వరకూ ఎవరూ గుర్తించని తొలి స్వాతంత్ర్య సంగ్రామం ఇదే కావచ్చునని ఆయన పేర్కొన్నారు.

Wall

Wall