18 Pages Movie: 18 పేజీల్లో ఫస్ట్ పేజీకి డేట్ ఫిక్స్ చేశారుగా!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘కార్తికేయ-2’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నిఖిల్, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ‘18 పేజీస్’ అనే యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్న నిఖిల్, ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

18 Pages Movie: 18 పేజీల్లో ఫస్ట్ పేజీకి డేట్ ఫిక్స్ చేశారుగా!

18 Pages Movie First Single Song Date Locked

18 Pages Movie: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘కార్తికేయ-2’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు జనం పట్టం కట్టారు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నిఖిల్, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు.

18 Pages : కార్తికేయ 2 హిట్ తర్వాత.. క్రిస్మస్ కానుకగా ’18 పేజెస్’.. రిలీజ్ డేట్ లీక్ చేసేసిన డైరెక్టర్..

ఇప్పటికే ‘18 పేజీస్’ అనే యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్న నిఖిల్, ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. కాగా, ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ చిత్రానికి కథను స్టార్ డైరెక్టర్ సుకుమార్ అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

18 Pages: నన్నయ్య రాసిన కావ్యంలా 18 పేజెస్ గ్లింప్స్!

తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ నవంబర్ 22న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ‘‘నన్నయ్య రాసిన..’’ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాను GA2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.