Telangana Teacher posts : తెలంగాణలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీ…!భర్తీ అయ్యేనా?అభ్యర్థుల ఆశలు ఫలించేనా?

తెలంగాణలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీతో డీఎస్సీ అభ్యర్ధులు తమ ఆశలు ఫలించేనా? అని ఎదురు చూస్తున్నారు.

Telangana Teacher posts : తెలంగాణలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీ…!భర్తీ అయ్యేనా?అభ్యర్థుల ఆశలు ఫలించేనా?

Telangana Dsc

18 Thousands  teacher posts in telangana : తెలంగాణా రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నారు.వీటిని భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. విద్యార్ధులకు తగినంతమంది టీచర్లు ఉండాలనే ఉద్ధేశంతో సీఎం టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీచర్ పోస్టులు భారీగా ఉన్నాయి. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 1.20లక్షల టీచర్ పోస్టులకు గానూ ప్రస్తుతం 1.02 లక్షల మంది పనిచేస్తున్నారని అధికారులు గుర్తించారు. వీటిని భర్తీ చేసే పనిలో పడ్డారు.

Read more : T.MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌..నాలుగు జిల్లాలకే పరిమితమా?

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 వేల టీచర్ పోస్టులను కొత్త జిల్లాలుగా విభజించి కేటాయిస్తారన్నట్లుగా సమాచారం. ఈ 18వేల పోస్టులు కాకుండా మరో 1500 బోధనేతర, డైట్, బీఈడీ కాలేజీలు, విద్యాశాఖ కార్యాలయాల్లో పోస్టులను కూడా జిల్లాల వారీగా విభజించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

గతంలో కూడా రాష్ట్రంలో 20వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెప్పినా..వాటి భర్తీ జరగలేదు. కేవలం 7వేల పైచిలుకు పోస్టుల తో నోటిఫికేషన్ ను విడుదల చేసారు. మరి ఈసారైనా ఖాళీలకు తగినట్లుగా భర్తీ జరుగుతుందా? లేదా? అనేది పెద్ద ప్రశ్నగానే ఉంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? మెగా డీఎస్సీ ఉంటుందా? లేదా? అని టీచర్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Read more: Priyanka Gandhi Son : LV ప్రసాద్ కంటి ఆసుపత్రి లో ప్రియాంక గాంధీ కుమారుడికి పరీక్షలు

కరోనా వచ్చాక చాలా కాలానికి స్కూళ్లు తెరుచుకున్నాయి. కానీ తగినంతమంది టీచర్లే లేరు. ఓ పక్క స్కూళ్లు తెరుచుకున్నాయి. విద్యార్ధులు స్కూళ్లకు వస్తున్నారు. కానీ విద్యార్దులకు తగినంతమంది టీచర్లు ఉన్నారా? అంటే లేదనే అంటున్నారు. కానీ వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.