Corona Cases : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..కొత్తగా 18,313 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 18 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,313 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 57 మంది మృతి చెందారు. 20,742 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.

Corona Cases : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..కొత్తగా 18,313 పాజిటివ్ కేసులు

COVID-19 update

corona cases : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 18 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం 14,830 కేసులు నమోద్వవగా, కొత్తగా 18,313 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 57 మంది మృతి చెందారు. 20,742 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.

కాగా, ఇప్పటివరకు దేశంలో 4,39,38,764 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 4,32,67,571 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,167 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. మరో 1,45,026 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.31 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

Telangana Covid Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కేసులు

మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 202.79 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.