ఆ కుటుంబంలో 19 మందికి కరోనా పాజిటివ్

ఆ కుటుంబంలో 19 మందికి కరోనా పాజిటివ్

ఆ కుటుంబంలో 19 మందికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఒకే కుటుంబంలో 19 మందికి కరోనా సోకింది. జహీరాబాద్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ ఈ నెల 9న హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ రాత్రే ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మరుసటి రోజు సాయంత్రానికి మృతురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులను గుర్తించి మిర్జాపూర్(బి) ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. 25 మంది శాంపిల్స్ పరీక్షలకు పంపారు. వారిలో 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా సోకిన వారిలో మహిళలు, పురుషులతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. పాజిటివ్‌గా వచ్చిన వారిని సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మహిళ అంత్యక్రియల్లో సుమారు 40 మంది పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నారు. వారందరినీ గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్నిఅధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించి రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. 

×