Girl Rape Murder 62 Years Ago Case:9 ఏళ్ల బాలికపై 62 ఏళ్ల క్రితం హత్యాచారం..తాజాగా తీర్పు..అసలైన ట్విస్ట్‌ ఏంటంటే..

9 ఏళ్ల చిన్నారిపై 62 ఏళ్ల క్రితం జరిగినా అత్యాచారం కేసులో కోర్టు తీర్పు ఇప్పుడే ఇచ్చింది. దోషి ఎవరో 62 ఏళ్లకు తెలిసింది. ఎలాగంటే..

Girl Rape Murder 62 Years Ago Case:9 ఏళ్ల బాలికపై 62 ఏళ్ల క్రితం హత్యాచారం..తాజాగా తీర్పు..అసలైన ట్విస్ట్‌ ఏంటంటే..

Girl Rape Murder Case 62 Years Ago

After 62 Years US Girl Murder Case Finally Solved With DNA Evidence : 9 ఏళ్ల చిన్నారిపై 62 ఏళ్ల క్రితం జరిగినా అత్యాచారం కేసులో కోర్టు తీర్పు ఇప్పుడే ఇచ్చింది. 6 దశాబ్దాల క్రితం ఓ చిన్నారిపై అత్యాచారం చేసి..హత్య చేసిన దోషులకు ఇన్నాళ్లేకు..కాదు కాదు ఇన్ని దశాబ్దాలకు దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది అమెరికా కోర్టు. టెక్నాలజీ ప్రస్తుతం ఎన్నో నేరాలు ఛేదిస్తున్నారు పోలీసులు. ఈక్రమంలో 60 ఏళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసుని ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి నేరాన్ని నిరూపించటంతో 9 ఏళ్ల బాలికపై 62 ఏళ్ల క్రితం జరిగిన ‘హత్యాచారం’ కేసులో తీర్పునిచ్చింది కోర్టు. డీఎన్‌ఏ టెస్ట్‌ ఆధారంగా అతడిని దోషిగా తేల్చి తీర్పునిచ్చింది.

62 ఏళ్ల క్రితం అత్యాచారం…హత్య
62 ఏళ్ల క్రితం అంటే 1959లో అమెరికాలోని స్పోకనే వెస్ట్ సెంట్రల్ పరిధిలోని ఓ ప్రాంతంలో తన కుటుంబంతో నివసిస్తున్న 9 ఏళ్ల చిన్నారి క్యాంప్‌ఫైర్‌ మింట్స్‌ అమ్మడానికి బయటకు వెళ్లింది. కానీ ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక గురించి వెతికినా ఫలితం దక్కలేదు. కానీ రెండు వారాల తర్వాత చిన్నారి మృతదేహం దొరికింది. బాలికపై అత్యాచారం జరిగినట్లుగా తరువాత ఆ బాలికను హత్య చేసినట్లుగా తేలింది. కానీ ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకోలేకపోయారు. బాలిక హత్యాచారానికి గురైన సమయంలో జాన్‌ రీగ్‌ అనే వ్యక్తి ఆ ప్రాంతంలోనే డ్యూటీలో ఉన్నాడు. కానీ అతనిపై పోలీసులకు ఎటువంటి అనుమానం రాలేదు.

ఆర్మీలో సైనికుడే నిందితుడు..
బాలిక మృతదేహానికి డాక్టర్లు పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు.. బాలికపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేశారని తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలించసాగారు. ఈకేసుకు సంబంధించి జాన్ రీగ్ హాఫ్ అనే అమెరికా ఆర్మీలో సైనికుడిగా పని చేసిన వ్యక్తిని ఎవ్వరు అనుమానించలేదు. జాన్‌ రీగ్‌ స్పోకేన్ కౌంటీలోని ఫెయిర్‌చైల్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో డ్యూటీ నిర్వహిస్తున్నాడు. అతను ఆర్మీ సైనికుడు కాబట్టి అతనిపై పోలీసులుకు ఎటువంటి అనుమానం రాలేదు.

నిందితుడిని పట్టించిన..మరో దారుణం
9 ఏళ్ల చిన్నారిని హత్య చేసిన జాన్‌ రీగ్‌..అక్కడితో ఆగలేదు. ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి చంపేశాడు. ఈ కేసులో పోలీసులు జాన్‌ రీగ్‌ పై అనుమానం వచ్చి విచారించగా ఈ కేసులో అతనే దోషిగా నిర్ధారించుకున్నారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి జాన్ రీగ్ వయసు 20 ఏళ్లు. మహిళను హత్య చేసిన కేసులో అమెరికా కోర్టు జాన్‌ రీగ్‌కి శిక్ష విధించింది న్యాయస్థానం.

మహిళ హత్య కేసు విచారణ సమయంలో జాన్‌ రీగ్‌కు సంబంధించి పోలీసులు ఆశ్చర్యపోయే విషయాలు తెలిసాయి. బాలిక హత్యాచారానికి గురైన సమయంలో జాన్‌ రీగ్‌ ఆ ప్రాంతంలోనే డ్యూటీలో ఉన్నట్లుగా తెలుసుకున్నారు. కానీ ఈ ఘటన 1959లో జరిగింది. ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు అమెరికాలో కూడా లేదు. దీంతో అతనిపై అనుమానాలు ఉన్నా బాలిక హత్యాచార కేసులో జాన్‌ రీగే నేరస్థుడని పోలీసులు నిరూపించలేకపోయారు.

ఇన్నాళ్టికి అత్యాధునిక డీఎన్‌ఏ పరిజ్ఞానం సాయంతో.. దోషిగా తేలిన వైనం..
2021 ప్రారంభంలో, టెక్సాస్‌లోని డీఎన్‌ఏ ల్యాబ్‌కు బాధితురాలి శరీరం నుంచి వీర్య నమూనాను తీసుకెళ్లడానికి పోలీసు డిపార్ట్‌మెంట్‌కు అనుమతి లభించింది. హత్యాచారానికి గురైన చిన్నారి శరీరంపై ఉన్న వీర్య నమూనాలను ముగ్గురు అనుమానితులతో పోల్చగా ముగ్గురిలో ఒకరితో మ్యాచ్ అయ్యింది. ఆ జాన్‌ రీగ్‌, అతడి ఇద్దరు సోదరులు. ఇక బాలిక శరీరం మీద లభ్యమైన వీర్య నమూనాలు జాన్‌ రీగ్‌తో మ్యాచ్ అయ్యాయి.దాంతో బాలికపై హత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తి జాన్‌ రీగ్‌ అని పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత కేసు మూసివేశారు. నిందితుడే నేరస్థుడని తేలాక మరి శిక్ష వేయకుండా కేసు ఎలా మూసివేస్తారు? అనే అనుమానం వచ్చి తీరుతుంది. 62 ఏళ్ క్రితం నాటి ఈ కేసులో అసలైన ట్విస్టు..అత్యంత కీలకమైన ట్విస్టు ఇక్కడే జరిగింది. దోషిగా తేలినా ప్రయోజనమేముంది? దోషిగా తేలిన ఆ నరరూప రాక్షసుడు 30 ఏళ్ల క్రితమే అంటే 1971లో చనిపోయాడు. మరి ఇక కోర్టు ఎవరిని శిక్షిస్తుంది? కానీ కోర్టులో దోషి ఎవరు మాత్రం తేల్చారు.

కేస్‌ ఇలా చేధించారు..
మహిళను హత్య చేసిన కేసులో జాన్‌ రీగ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. బాలిక హత్యాచారం కేసులో అతడే నిందితుడై ఉంటాడని అనుమానించారు. ఎందుకంటే ఈ సమయంలో జాన్ రీగ్ ఆ ప్రాంతంలోనే డ్యూటీలో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఆ అనుమానంతోనే పోలీసులు జాన్‌ రీగ్‌తో పాటు అతడి ఇద్దరు సోదరులు వీర్య నమూనాలను సేకరించారు.అప్పటికే సేకరించి భద్రపరిచిన బాధిత బాలికపై ఉన్న వీర్య నమూనాలతో తాజాగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక డీఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వీటిని సరిచూసారు. అలా అసలు దోషి జాన్‌ రీగ్‌ను నేరస్థుడిగా నిర్థారించారు. దీంతో ఈ కేసులో అసలు దోషి జాన్ రీగ్ అని తేల్చింది కోర్టు. కానీ దోషి చనిపోవటంతో ఫైల్‌ ముసివేశారు.