1997 Movie : నవంబర్ 26న ‘1997’

రియల్ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా రూపొందిన డిఫరెంట్ మూవీ ‘1997’..

1997 Movie : నవంబర్ 26న ‘1997’

1997

1997 Movie: డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం ‘1997’. రియల్ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా రూపొందిన డిఫరెంట్ మూవీ ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, మూడు ప్రధాన పాత్రల్లో నటించిన మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ విడుదలైన విషయం తెలిసిందే.

Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..

అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’కు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ సినిమా నవంబర్ 26వ తేదీన విడుదల అవుతున్నట్టు రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతమందిస్తుండటం విశేషం. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

NBK : ‘సూర్యవంశీ’ సినిమాలో బాలయ్య బొమ్మ

1997 Movie

 

నటీనటులు : డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు…
బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : కోటి
కెమెరా : చిట్టి బాబు
నిర్మాత: మీనాక్షి రమావత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.

1997 Movie : డాక్టర్ మోహన్ లుక్ రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్..