china: భారత్‌లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన ఇద్ద‌రు చైనీయుల అరెస్టు

వీసా లేకుండా భారత్‌లోకి ప్ర‌వేశించి, రెండు వారాల పాటు ఇక్క‌డే ఉన్నారు ఇద్ద‌రు చైనీయులు. ఆదివారం వారు నేపాల్ వెళ్తుండ‌గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

china: భారత్‌లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన ఇద్ద‌రు చైనీయుల అరెస్టు

Hyderabad Police Arrest Robber

china: వీసా లేకుండా భారత్‌లోకి ప్ర‌వేశించి, రెండు వారాల పాటు ఇక్క‌డే ఉన్నారు ఇద్ద‌రు చైనీయులు. ఆదివారం వారు నేపాల్ వెళ్తుండ‌గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. వారిద్ద‌రు భార‌త్‌లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ ప‌రిధిలోని ప్రాంతాల్లో ఉన్నార‌ని అధికారులు చెప్పారు. వారిద్ద‌రిని బిహార్‌లో స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ ద‌ళం స‌శ‌స్త్ర సీమా బ‌ల్ (ఎస్ఎస్బీ) అదుపులోకి తీసుకున్న‌ట్లు వివ‌రించారు. ఆ ఇద్ద‌రు చైనీయుల పేర్లు లు లాంగ్ (28), యువాన్ హైలాంగ్ (34) అని అధికారులు తెలిపారు.

prophet row: విచార‌ణ‌కు రావ‌డానికి స‌మ‌యం ఇవ్వండి: నుపుర్ శ‌ర్మ‌

వారిద్ద‌రి వ‌ద్ద చైనీస్ పాస్‌పోర్టులు ఉన్న‌ప్ప‌టికీ వీసాలు లేవ‌ని వారు చెప్పారు. వారిద్ద‌రు ఓ ట్యాక్సీ నుంచి దిగి కాలినడ‌క‌న‌ భార‌త్-నేపాల్ స‌రిహ‌ద్దు దాట‌డానికి ప్ర‌య‌త్నించార‌ని తెలిపారు. రెండు వారాల క్రితం నేపాల్ మీదుగా భార‌త్‌లోకి ప్ర‌వేశించి నోయిడాకు వెళ్లామ‌ని ఆ ఇద్ద‌రు చైనీయులు విచార‌ణ‌లో చెప్పార‌ని అధికారులు వివ‌రించారు. అక్క‌డ త‌మ‌కు ప‌రిచ‌యం ఉన్న వారి ఇంట్లో ఉన్నామ‌ని వారు అంటున్నార‌ని చెప్పారు. అయితే, ఆ ఇద్ద‌రు చైనీయులు ఓ ఆర్థిక మోసానికి రాకెట్‌లో భాగ‌స్వాములుగా తాము గుర్తించామ‌ని అధికారులు తెలిపారు. ఈ విష‌యంపై త‌దుప‌రి విచారణ జ‌రుపుతున్నామ‌ని చెప్పారు.