Assam floods: అసోంలో వరదలు.. ఒక్క రోజులో ఏడుగురు మృతి

ఇంకా 2.8 లక్షల మంది వరద ముంపులోనే చిక్కుకున్నారు. 1,395 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తోంది. అసోంలో 35 జిల్లాలు ఉంటే, 30 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి.

Assam floods: అసోంలో వరదలు.. ఒక్క రోజులో ఏడుగురు మృతి

Assam Floods

Assam floods: అసోంను వరద ప్రభావం ఇంకా వీడటం లేదు. రాష్ట్రంలో వరదలు, కొండ చరియలు విరిగి పడటం వల్ల గడిచిన 24 గంటల్లో ఏడుగురు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వరదలతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 101కి చేరింది.

Gautam Adani: అదానీ 60వ పుట్టిన రోజు.. 60 వేల కోట్ల విరాళం

ఇంకా 2.8 లక్షల మంది వరద ముంపులోనే చిక్కుకున్నారు. 1,395 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తోంది. అసోంలో 35 జిల్లాలు ఉంటే, 30 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో వరద ప్రభావంపై ప్రధాని మోదీ గురువారం పలు ట్వీట్లు చేశారు. ఎప్పటికప్పుడు కేంద్రం వరద పరిస్థితిని సమీక్షిస్తోందని, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు బాధితులకు సాయం అందిస్తున్నాయని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రానికి అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు.

Spotify: స్పోటిఫైలో కమ్యూనిటీ ఫీచర్

మరోవైపు రాష్ట్రంలో వరదల దృష్ట్యా వేసవి సెలవులను మార్చేసింది విద్యా శాఖ. జూలై 1న సెలవులు ప్రారంభం కావాల్సి ఉండగా, వారం ముందుగా.. అంటే జూన్ 25 నుంచి జూలై 25 వరకు సెలవులు కొనసాగుతాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ప్రస్తుతం పాఠశాలలు వరద సహాయక కేంద్రాలుగా ఉన్న కారణంగా, పాఠశాలలు నిర్వహించలేమని విద్యాశాఖ తెలిపింది.