YSR Kadapa: బ్రహ్మంగారిమఠానికి రానున్న 20 మంది పీఠాధిపతులు!

కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ఎవరనే అంశంపై ఇంకా సన్పెన్స్ కొనసాగుతోంది. పీఠాధిపత్యం తమకంటే... తమకంటూ కుటుంబ సభ్యుల మధ్య గొడవతో చర్చనీయాంశమైంది. ఇప్పటికే 12 మంది తెలుగు రాష్ట్రాల్లో మఠాధిపతులు పీఠముడి విప్పే ప్రయత్నం చేశారు.

YSR Kadapa: బ్రహ్మంగారిమఠానికి రానున్న 20 మంది పీఠాధిపతులు!

Brahmangarimatha

YSR Kadapa: కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ఎవరనే అంశంపై ఇంకా సన్పెన్స్ కొనసాగుతోంది. పీఠాధిపత్యం తమకంటే… తమకంటూ కుటుంబ సభ్యుల మధ్య గొడవతో చర్చనీయాంశమైంది. ఇప్పటికే 12 మంది తెలుగు రాష్ట్రాల్లో మఠాధిపతులు పీఠముడి విప్పే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా మరోసారి 20 మంది పీఠాధిపతులు మఠానికి రానున్నారు. కాలజ్ఞానం ద్వారా ప్రపంచానికి భవిష్యత్‌ను చూపించిన బ్రహ్మంగారి వంశంలో కుటుంబ కలహాలు చర్చకు దారితీశాయి. అయితే కడప జిల్లాలో ఉన్న బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం సమస్య ముగింపు దశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది.

కాబోయే పీఠాధిపతి ఎవరు అనే అంశం త్వరలో తేలిపోనుందని శైవక్షేత్ర మఠాధిపతి శివస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు (జూన్ 12) శివస్వామి ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ నుంచి 20 మంది మఠాధిపతులు బ్రహ్మంగారి మఠానికి రానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం పీఠాధిపత్యంపై వారసులను అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఇందులో భాగంగా విశ్వ బ్రహ్మణ సంఘాల వారి అభిప్రాయాలను కూడా స్వీకరించనున్నారు.

ఇప్పటికే పీఠాధిపతి ఎవరు అనే అంశంపై అభిప్రాయాలను నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని చెప్పారు. పీఠాధిపతి వారసులు నాలుగు రోజుల సమయం అడిగారని గుర్తు చేశారు శివస్వామి జగద్గురువు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంస్థానంలో నెలకొన్న సమస్యకు పరిష్కారం చూపడమే తమ ధ్యేయమన్నారు బ్రహ్మపదం పీఠాధిపతి. రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించడానికి మఠాధిపతుల బృందం కృషి చేస్తోందని తెలిపారు. త్వరలో పీఠాధిపతిని నిర్ణయించి అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో 12 మంది మఠాధిపతులు ఈ సమస్య పరిష్కారం కోసం బ్రహ్మంగారి మఠంలో పర్యటించారు. అక్కడ స్థానికులు, బ్రహ్మంగారి వారసులతో చర్చించారు. అయితే ఇప్పటికీ ఆ సమస్య కొలిక్కి రాలేదు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. దీంతో మరోసారి 20 మంది వివిధ మఠాధిపతులు మఠంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి ఎనిమిది గంటలకు బ్రహ్మంగారి మఠంకు చేరుకొనున్న పీఠాధిపతులు రాత్రికి వాసవి కన్యకా పరమేశ్వరి గృహంలో విడిది చేసి ఆదివారం ఉదయం 10 గంటలకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సందర్శన అనంతరం తిరిగి బ్రహ్మంగారిమఠం పయనం కానున్నారు.