Indian Student: కెనడాలో ట్రక్కు ఢీకొని భారతీయ విద్యార్థి మృతి.. సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా ప్రమాదం

కెనడాలో 20 ఏళ్ల భారతీయ విద్యార్థి మరణించాడు. గత ఏడాది చదువు కోసం కెనడా వెళ్లిన యువకుడు అక్కడి టొరంటో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

Indian Student: కెనడాలో ట్రక్కు ఢీకొని భారతీయ విద్యార్థి మృతి.. సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా ప్రమాదం

Indian Student: కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థి మరణించాడు. టొరంటో నగరంలోని యోంజ్ స్ట్రీట్, సెయింట్ క్లెయిర్ అవెన్యూ దగ్గర గత బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కార్తీక్ సైని అనే 20 ఏళ్ల యువకుడు సైకిల్‌పై రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొంది.

Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సింగపూర్‌కు లాలూ.. కిడ్నీ దానం చేస్తున్న లాలూ కూతురు

కొద్ది దూరం అతడిని ట్రక్కు అలాగే లాక్కెళ్లింది. ఈ ఘటనలో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన అధికారులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. హరియాణాకు చెందిన కార్తీక్ గత ఏడాదే కెనడాకు చదువుకోసం వెళ్లాడు. కార్తీక్ మరణంపై అక్కడ ఉంటున్న అతడి సన్నిహితులు సంతాపం ప్రకటించారు. సంతాప సూచకంగా ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని అక్కడి వాళ్లు తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, అక్కడే ఉంటున్న కార్తీక్ బంధువు మాట్లాడుతూ ఈ విషయంపై ఇండియాలోని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు, అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాడు.

ఈ ఘటనపై కెనడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఘటన బాధ్యత ఎవరిది అనే అంశం తేల్చేందుకు కొంత సమయం పడుతుందని, విచారణకు అప్పుడే అంత తొందరలేదని పోలీసులు చెప్పారు.