2022 Movies: ఫస్ట్ క్వార్టర్ రివ్యూ.. పాజిటివ్ వైబ్స్ ఇచ్చిన సినిమాలివే!

అప్పుడే 2022కి సంబంధించి 3 నెలలు అయిపోయాయి. సినిమాలకు సంబంధించి ఈ ఫస్ట్ క్వార్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. కోవిడ్ దెబ్బకి రెండేళ్లనుంచి సరైన సినిమాలు రిలీజ్ చెయ్యని..

2022 Movies: ఫస్ట్ క్వార్టర్ రివ్యూ.. పాజిటివ్ వైబ్స్ ఇచ్చిన సినిమాలివే!

2022 Movies

2022 Movies: అప్పుడే 2022కి సంబంధించి 3 నెలలు అయిపోయాయి. సినిమాలకు సంబంధించి ఈ ఫస్ట్ క్వార్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. కోవిడ్ దెబ్బకి రెండేళ్లనుంచి సరైన సినిమాలు రిలీజ్ చెయ్యని టాలీవుడ్.. కాస్త ఊపిరి పీల్చుకుని ధైర్యం చేసి మరీ ఈ 3 నెలలు సినిమాలు ధియేటర్లోకొ తెచ్చింది. మరి ఏ సినిమాలు బాక్సాఫీస్ బద్దలుకొట్టాయో, ఏ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయో.. ఈ ఫస్ట్ క్వార్టర్ టాలీవుడ్ కి ఎలాంటి రిజల్ట్ మిగిల్చిందో డీటెయిల్డ్ గా చూద్దాం.

Movie Releases: స్టార్ హీరోల హవా.. చిన్న హీరోల టార్గెట్ ఈ రెండు నెలలే!

2022లో ఫస్ట్ 3 నెలలు అయిపోయాయి. టాలీవుడ్ ఈ మూడు నెలలు కొన్ని హిట్లు, ఫ్లాపులతో ఫస్ట్ క్వార్టర్ ని బాగానే కంప్లీట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయనుకున్న సినిమాలు డిజాస్టర్ అయితే.. అసలు ఈ సినిమాలు ధియేటర్ దాకా వస్తాయా అనుకున్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ వీక్ లో అతిదిదేవోభవ, 1945 లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయినా అసలు అవి వచ్చినట్టు కూడా జనానికి తెలీలేదు.

Movie Releases: విజయ్-యష్ మూవీ వార్.. మధ్యలో నేనున్నానంటున్న షాహిద్!

ఇక సంక్రాంతి సీజన్ నుంచే అసలు టాలీవుడ్ సందడి స్టార్ట్ అయ్యింది. జనవరి 14న బంగార్రాజు చేసిన సందడి అంతా ఇంతా కాదు. కోవిడ్ ఉన్నా కూడా సినిమా స్టార్ట్ చేసినప్పుడే సంక్రాంతిని ఎయిమ్ చేసుకున్న బంగార్రాజు అనుకున్నట్టే సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నాగార్జున, నాగచైతన్య ఇద్దరూ కలిసి బంగార్రాజు సినిమాని పెద్ద సక్సెస్ చేసి కొత్త సంవత్సరాన్ని ఫుల్ ఎంటర్టైనింగ్ గా స్టార్ట్ చేశారు.

Movie Releases: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలివే!

సంక్రాంతి సీజన్ లోనే రౌడీబాయ్స్, సూపర్ మచ్చి, హీరో లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక కీర్తిసురేష్, ఆది, జగపతి బాబు లీడ్ రోల్స్ లో తెరకెక్కిన షూటింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గుడ్ లక్ సఖి ఆగి ఆగి ధియేటర్లోకొచ్చినా.. ధియేటర్లో మాత్రం అసలు ఆగకుండా అంతే స్పీడ్ గా వెళ్లిపోయింది.

Movie Releases: నీ ప్రతాపమా.. నా ప్రతాపమా.. ధియేటర్లు-ఓటీటీల ఎంటర్‌టైన్‌మెంట్ ఫైట్!

జనవరి పాజిటివ్ గా కనిపించింది కాబట్టి.. అదే స్పీడ్ లో ఫిబ్రవరి సినిమాలు కూడా వరసగా లైనప్ అయ్యాయి. వీటిలో ద మోస్ట్ అవెయింట్ మూవీ రవితేజ ఖిలాడి. రవితేజ డ్యూయల్ రోల్ లో రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఖిలాడి గ్రాండ్ గా హిందీలో కూడా రిలీజ్ చేశారు. కానీ.. సినిమా మాత్రం అస్సలు అంచనాల్ని అందుకోలేక డిజాస్టర్ అయ్యింది.

Movie Releases: సినిమా చూపిస్తా మావా.. టాలీవుడ్ సినిమా సందడి షురూ!

ఫిబ్రవరి 11న రవితేజ సినిమా డిసప్పాయింట్ చేస్తే.. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన డి.జె టిల్లు మాత్రం.. అబ్బో అదిరిపోయే హిట్ కొట్టింది. సిద్దు, నేహాశెట్టి జంటగా విమల్ డైరెక్షన్లో తెరకెక్కిన డి.జె.టిల్లు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించింది. ఖిలాడీతో పోటీ ఎందుకని ఒక రోజు లేట్ గానే రిలీజ్ అయిన డిజె టిల్లు రవితేజని అడ్రస్ లేకుండా చేసేశాడు.

Movie Releases: కళకళాడుతున్న టాలీవుడ్.. ఎటు చూసినా ఫుల్ జోష్!

అసలు సిసలు పెద్ద సినిమాల సందడి స్టార్ట్ అయ్యింది మాత్రం ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో. ఫిబ్రవరి 25న ఫాన్స్ అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యింది. లాలా భీమ్లా అంటూ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రానా, పవన్ కళ్యాణ్ లీడ్ రోల్స్ లో సాగర్ చంద్ర డైరెక్షన్లో రిలీజ్ అయిన భీమ్లానాయక్.. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఫాన్స్ కి మాస్ ఫీస్ట్ ఇచ్చింది.

Telugu Movies Releases: సమ్మర్ లో హీటెక్కించబోతున్న సినిమా జాతర

భీమ్లా నాయక్ ఇచ్చిన బూస్ట్ తో వరసగా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. నిజానికి మార్చి ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి పెద్దగా సినిమాలు రిలీజ్ పెట్టుకోవు. కానీ అసలే కోవిడ్ తో లేటయిన సినిమాలతో పాటు.. ఎకడమిక్ ఇయర్ లో ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో.. ట్రిపుల్ఆర్ లాంటి సినిమాలు ధైర్యం చేసి మార్చిలోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి.

Movie Release: ఫ్యాన్స్‌కిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్న ప్రభాస్!

మార్చి ఫస్ట్ వీక్ నుంచే సినిమాలు ఫుల్ స్పీడ్ పెంచేశాయి. గ్యాప్ లేకుండా వారం వారం సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. వాటిలో మార్చి 4న ఎప్పటినుంచో మాంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ రిలీజ్ అయ్యింది. రష్మిక మందాన, జోడీగా వచ్చిన ఈ ప్యామిలీ లవ్ స్టోరీ ఏమాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అదే రోజు కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ పిసి 524 సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా కిరణ్ కెరీర్ కి ప్లస్ కాలేకపోయింది.

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

రెండేళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అని ఫాన్స్ అందరూ వెయిట్ చేస్తున్న ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ మొత్తానికి రిలీజ్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో రాధేశ్యామ్ మార్చి 11న వరల్డ్ వైడ్ గా రికార్డ్ ధియేటర్లలో రిలీజ్ అయ్యింది. 300 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ మినిమం ఎక్స్ పెక్టేషన్స్ ని కూడా రీచ్ కాలేక, ఫాన్స్ ని డిసప్పాయింట్ చేసి.. ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. మార్చి 18న రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ రిలీజ్ అయ్యినా.. అసలు ఈ సినిమా ధియేటర్లోకి వచ్చిన సంగతే జనాలు పట్టించుకోలేదు .

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

వరల్డ్ వైడ్ ఫాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని 4 ఏళ్ల నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ట్రిపుల్ఆర్. ఎన్టీఆర్, చరణ్ లీడ్ రోల్స్ లో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ 4రిలీజ్ డేట్స్ మార్చుకుని మార్చి 25న ఫైనల్లీ వరల్డ్ వైడ్ గా ధియేటర్లో రిలీజ్ అయ్యింది. రాజమౌళి విజువల్ వండర్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోల ఎక్స్ ట్రార్డినరీ యాక్షన్ తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రిలీజ్ అయ్యిన 5 రోజుల్లోనే 650 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డ్ కలెక్షన్లతో, అంతకుమించి సూపర్ హిట్ టాక్ తో ఫస్ట్ క్వార్టర్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయ్యింది ట్రిపుల్ ఆర్. ఓవరాల్ గా 2022 ఫస్ట్ క్వార్టర్ లో రిలీజ్ అయిన సినిమాల్లో మేజర్.. మంచి కలెక్షన్లతో టాలీవుడ్ కి పాజిటివ్ వైబ్ ఇచ్చాయి సినిమాలు.