Jail wall collapses : జైలు గోడ కూలి.. 22 మంది ఖైదీలకు గాయాలు

మధ్యప్రదేశ్ భిండ్ జిల్లా జైల్లో గోడ కూలి 22మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున కూలిన బ్యారక్ గోడ కూలిపోవటంతో గాయపడిన ఖైదీలను అధికారులు గ్వాలియర్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.గాయపడిన ఖైదీల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం.

Jail wall collapses : జైలు గోడ కూలి.. 22 మంది ఖైదీలకు గాయాలు

Jail Wall Collapses..22 Prisoners Injured

Jail wall collapses..22 prisoners injured : పలు కేసుల్లో శిక్ష అనుభవించే ఖైదీలు జైలులో తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్ భిండ్ జిల్లా జైల్లో గోడ కూలి 22మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున కూలిన బ్యారక్ గోడ కూలిపోవటంతో గాయపడిన ఖైదీలను అధికారులు గ్వాలియర్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.గాయపడిన ఖైదీల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం.

ఈ ఘటనపై భిండ్ జిల్లా పోలీసు అధికారి మనోజ్ కుమార్ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ..శనివారం (జులై31,2021)రుజామున 5.10 గంటల సమయంలో 6వ నంబర్ బ్యారక్ లో గోడ కూలిపోయింది. ఈ ఘటనలో గాయపడిన ఖైదీలు గ్వాలియర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ జైలు భవనం పురాతనమైనది కావటం..దీనికి తోడు కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోడ బాగా నానిపోయి కూలిపోయి ఉండవచ్చని భావిస్తున్నామని తెలిపారు.

ఈ జైల్లో ప్రస్తుతం 255 మంది ఖైదీలు ఉన్నారని..గోడ కూలిన సమయంలో 22మంది ఖైదీలు గాయపడ్డారని తెలిపారు. సంఘటన సమయంలో జైలు లోపల 255 మంది ఖైదీలు ఉన్నారని ఆయన తెలిపారు. దీనిపై తమకు సమాచారం అందిన వెంటనే పోలీసు సిబ్బంది, రెస్క్యూ టీమ్ కలిసి సహాయం చర్యలు ప్రారంభించి గాయపడినవారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నామనివెల్లడించారు.