24 carat gold chai : 24 క్యారెట్ల బంగారం టీ .. ఎక్కడ దొరుకుతుందంటే?

టీ యాడ్స్‌లో బంగారం లాంటి రుచి అనే మాటలు విన్నాం. కానీ లక్నోలో టీలో బంగారం కలిపి ఇస్తున్నారు . ఓ బ్లాగర్ '24 క్యారెట్ గోల్డెన్ చాయ్'‌ని పరిచయం చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు.

24 carat gold chai : 24 క్యారెట్ల బంగారం టీ .. ఎక్కడ దొరుకుతుందంటే?

24 carat gold chai

24 carat gold chai :  సీజన్ ఏదైనా టీ అంటే ఇష్టపడని వారు ఉండరు. టీ లవర్స్ కోసం రకరకాల టీలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా 25 క్యారెట్ గోల్డెన్ చాయ్ లక్నోలో దొరుకుతోంది. ఇక దీని ధర.. రుచి తెలుసుకుందామా?

Paper Cups Side Effects : పేపరు కప్పుల్లో టీ తాగుతున్నారా ? మైక్రో ప్లాస్టిక్ కణాలతో నరాలపై దుష్ప్రభావం !

టీ అంటే చాలామందికి ఇష్టం. నలుగురు స్నేహితులు కలిస్తే చాయ్ అడ్డాల దగ్గర మీటింగ్ పెడతారు. ఇక టీ లవర్స్ ని ఆకర్షించడం కోసం వ్యాపారులు కూడా రకరకాల టీలు తయారు చేస్తూ ఉంటారు. అల్లం చాయ్, లెమన్ చాయ్, బ్లాక్ టీ .. ఇలా రకరకాల టీలు అందుబాటులో ఉన్నాయి. రీసెంట్ గా లక్నోకి చెందిన ఫుడ్ బ్లాగర్ ’24 క్యారెట్ గోల్డెన్ చాయ్’ ని తన ఇన్ స్టాగ్రామ్ వీడియోలో పరిచయం చేశారు.

 

eattwithsid యూజర్ పేరుతో షేరైన ఈ వీడియోలో టీ వ్యాపారి కప్పులో టీ పోస్తూ అందులో మలాయ్ కలుపుతాడు. ఆ తరువాత బంగారు రేకును కప్పుపైన ఉంచుతారు. ఈ చాయ్ ధర అక్షరాల 150 రూపాయలు. ఈ టీ తాగడానికి ఎవరు ప్రయత్నిస్తారు? అనే ట్యాగ్ తో పోస్టైన ఈ వీడియోపై మిశ్రమ స్పందన లభించింది.

Rose Tea : రాత్రి సమయంలో రోజ్ టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

ఈ టీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ యూజర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. గోల్డెన్ చాయ్ వీడియోని చూసి కొందరు ఆశ్చర్యపోగా మరికొందరు ధర మరీ ఎక్కువగా ఉందని స్పందించారు. ఇక ఈ బంగారు టీ రుచి చూడాలంటే లక్నో వెళ్లాలేమో?