చిన్నారులకు ఫేస్ మాస్కులతో జాగ్రత్త!

  • Published By: srihari ,Published On : May 27, 2020 / 01:44 AM IST
చిన్నారులకు ఫేస్ మాస్కులతో జాగ్రత్త!

కరోనా పుణ్యామని అందరిలోనూ శుభ్రత ఎంతో అవసరమో తెలిసొచ్చింది. ఫేస్ మాస్క్ కూడా అంతే.. బయటకు రావాలంటే మాస్క్ ఉండాల్సిందే. కరోనా భయంతో చాలామంది మాస్క్ లేకుండా ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ఇప్పుడు ప్రతిఒక్కరి జీవన విధానంలో మాస్క్ ఒక భాగమైంది. హాంకాంగ్‌లోని ప‌రిశోధ‌కుల అధ్య‌య‌నం ప్ర‌కారం.. మాస్కులు క‌రోనా వంటి వైర‌స్‌ల వ్యాప్తిని నిరోధించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాయని స్పష్టం చేశారు.

3వేల‌మందిపై అధ్య‌య‌నం చేసిన అనంతరం ఈ విష‌యాన్ని పరిశోధకులు వెల్ల‌డించారు. ఫేస్ మాస్క్ ధ‌రించ‌నివారిలో వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఎక్కువ ఉన్నాయ‌న్నారు. ఈ ఫేస్ మాస్క్ వ‌ల్ల వైరస్ బారిన పడకుండా రక్షిస్తుందో అలాగే మాస్క్ కంటిన్యూగా పెట్టుకోవడం ద్వారా మరెన్నో దుష్ప్ర‌భావాలు కలుగుతున్నాయని అంటున్నారు. అందులోనూ పిల్ల‌ల‌కు మాస్క్‌లు ఎంతో హానిక‌ర‌మ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

గంట‌ల త‌ర‌బ‌డి మాస్క్ ధ‌రించ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయి తగ్గిపోయినట్టు గుర్తించారు. సింథ‌టిక్ ప‌దార్థంతో త‌యారు చేసిన మాస్క్‌ల‌ను వినియోగించిన వారిలో ముఖంపై ద‌ద్దుర్లు వ‌స్తున్నాయని అంటున్నారు. N95, N 99, కాట‌న్ మాస్క్ లేదా సొంతంగా మాస్క్‌లు త‌యారు చేసి వినియోగించుకోవాలని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. రెండేళ్లు కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌కు మాస్కులు ధ‌రించ‌డం ప్ర‌మాద‌క‌రమని జ‌పాన్ పీడియాట్రిక్ అసోసియేష‌న్ హెచ్చ‌రించింది. 

‘ఫేస్ మాస్క్ ధ‌రించ‌డం వ‌ల్ల ఊపిరి పీల్చుకోవ‌డంలో ఇబ్బంది పడతారు. గుండెపై అధిక భారం ప‌డుతుందని అధ్య‌య‌నంలో తేలింది. మాస్కులు వాడ‌టం వ‌ల్ల పిల్ల‌ల్లో శ్వాస‌కోస స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని గుర్తించారు. న్యూమోనియాకు దారి తీసే ప్ర‌మాదముందని హెచ్చ‌రించింది. పిల్ల‌ల శ‌రీరం నుంచి వెలువ‌డే వేడిని సైతం బ‌య‌ట‌కు పోకుండా మాస్కులు అడ్డుపడ‌తాయ‌ని వెల్లడించింది. రెండేళ్ల కంటే ఎక్కువ వ‌యసున్న వారు మాత్ర‌మే ఫేస్ మాస్కుల‌ను వినియోగించాల‌ని అమెరిక‌న్ CDC స్పష్టం చేసింది.