Jawans Killed: ఛత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్ కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి

సీఆర్‌పీఎఫ్‌, 19వ బెటాలియన్ రోడ్ ఓపెనింగ్ పార్టీకి చెందిన జవాన్లు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో రోడ్ ఓపెనింగ్ కోసం ఒక క్యాంప్ నుంచి మరో క్యాంప్‌నకు వెళ్తుండగా, నక్సల్స్ కాల్పులు ప్రారంభించారు. దీంతో ఈ బృందంలో ఉన్న ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు.

Jawans Killed: ఛత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్ కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి

Jawans Killed

Jawans Killed: ఛత్తీస్‌ఘడ్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై నక్సల్స్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించినట్లు సమాచారం. ఛత్తీస్‌ఘడ్‌-ఒడిశా సరిహద్దులో, బోడెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సహజ్ పానీ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సీఆర్‌పీఎఫ్‌, 19వ బెటాలియన్ రోడ్ ఓపెనింగ్ పార్టీకి చెందిన జవాన్లు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో రోడ్ ఓపెనింగ్ కోసం ఒక క్యాంప్ నుంచి మరో క్యాంప్‌నకు వెళ్తుండగా, నక్సల్స్ కాల్పులు ప్రారంభించారు. దీంతో ఈ బృందంలో ఉన్న ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. జవాన్ల దగ్గరి నుంచి నక్సల్స్ మూడు ఏకే 47 రైఫిల్స్, ఇతర ఆయుధాలు ఎత్తుకెళ్లారు.

Tollywood Strike: ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్‌ల మధ్య ముదిరిన వివాదం

ఘటన సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ, ఇతర సీనియర్ అధికారులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరింతమంది భద్రతా సిబ్బందిని ఈ ఆపరేషన్ కోసం వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరణించిన జవాన్లను ఏఎస్ఐ శిశు పాల్ సింగ్, ఏఎస్ఐ శివ్ లాల్, కానిస్టేబుల్ ధర్మేంద్ర కుమార్ సింగ్‌గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.