Suryakumar Yadav: వరుసగా మూడు వన్డేల్లో గోల్డెన్ డక్.. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్

360 డిగ్రీ ప్లేయర్‌గా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు సార్లు గోల్డెన్ డకౌట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇలా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మొదటి రెండు మ్యాచుల్లో మిచెల్ స్టార్క్ బౌలింగులో ఔట్ కాగా, మూడో మ్యాచులో ఆష్టన్ అగర్ బౌలింగులో బౌల్డ్ అయ్యాడు.

Suryakumar Yadav: భవిష్యత్ స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల వరుసగా వైఫల్యాల్ని ఎదుర్కొంటున్నాడు. గత మూడు వన్డేల్లో వరుసగా మొదటి బంతికే డకౌట్ అయ్యాడు.
దీన్ని గోల్డెన్ డకౌట్ అంటారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ.. మోదీపై వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష

పరుగులేమీ చేయకుండా ఔట్ అయితే అది డకౌట్ అని, మొదటి బంతికే సున్నా పరుగులకే ఔట్ అయితే దాన్ని గోల్డెన్ డకౌట్ అంటారు. అయితే, 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు సార్లు గోల్డెన్ డకౌట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇలా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మొదటి రెండు మ్యాచుల్లో మిచెల్ స్టార్క్ బౌలింగులో ఔట్ కాగా, మూడో మ్యాచులో ఆష్టన్ అగర్ బౌలింగులో బౌల్డ్ అయ్యాడు. ఈ సిరీస్‌ను ఇండియా 1-2తో కోల్పోయిన సంగతి తెలిసిందే. చాలా అరుదుగా మాత్రమే ఆటగాళ్లు ఇలా వరుసగా గోల్డెన్ డకౌట్ అవుతుంటారు.

London: లండన్‌లో భారత రాయబార కార్యాలయంపై భారీ మూడు రంగుల జెండా.. వీడియో వైరల్

గతంలో తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే వన్డేల్లో ఇలా ఔటయ్యారు. ఇండియాకు సంబంధించి సచిన్ టెండూల్కర్ (1994), అనిల్ కుంబ్లే (1996), జహీర్ ఖాన్ (2003-04), ఇషాంత్ శర్మ (2010-11), జస్ప్రీత్ బుమ్రా (2017-18) ఇలా ఔటయ్యారు. ఇప్పుడీ జాబితాలో సూర్యకుమార్ కూడా చేరాడు. మూడుసార్లు వరుసగా గోల్డెన్ డకౌట్ అయిన ఆరో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అయితే, సూర్యకుమార్ యాదవ్‌కు సీనియర్ ఆటగాళ్లు అండగా నిలబడుతున్నారు. ఈ టోర్నీని వదిలేసి, రాబోయే ఐపీఎల్‌పై దృష్టిపెట్టాలని సూర్య కుమార్ యాదవ్‌కు సునీల్ గవాస్కర్ సూచించాడు. రాబోయే ఐపీఎల్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడబోతున్నాడు.

 

ట్రెండింగ్ వార్తలు