MLAs Suspended: కార్లలో నోట్ల కట్టల ఎఫెక్ట్.. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్

జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కార్లలో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

MLAs Suspended: కార్లలో నోట్ల కట్టల ఎఫెక్ట్.. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్

MLAs Suspended: జార్ఖండ్ కాంగ్రెస్ లో కార్లలో నోట్ల కట్టల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. శనివారం రాత్రి జమ్తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ, ఖిజ్రీ ఎమ్మెల్యే రాజేష్ కచ్చప్, కొలెబిరా ఎమ్మెల్యే నమన్ బిక్సల్ కొంగరిలు తమ కార్లలో నోట్లకట్టలతో వెళ్తుండగా బెంగాల్ లోని హౌరా పోలీసులు పట్టుకున్న విషయం విధితమే. వారి కార్లలోని రూ.49లక్షల నగదును సీజ్ చేసి ముగ్గురు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం జార్ఖండ్ కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. అంతేకాక రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రచ్చకు దారి తీసింది.

Narendra Modi: జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోండి: ప్రధాని మోదీ

ఇదిలాఉంటే నోట్ల కట్టలతో పోలీసులకు పట్టుబడిన ఎమ్మెల్యేలు మాత్రం.. గిరిజనుల పండుగకు చీరలు కొనుగోలు చేసేందుకు నగదును తీసుకువెళుతున్నామని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులకు పట్టుబడిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, జార్ఖండ్ ఇన్‌చార్జి అవినాష్ పాండే మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముగ్గురు ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. మరోవైపు.. జార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోలీసులకు పట్టుబడిన కొద్దిసేపటికే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్ చేశారు. జార్ఖండ్‌లో బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ రాత్రి హౌరాలో బట్టబయలైందన్నారు. జార్ఖండ్‌లో ఈడీ ని రంగంలోకి దింపడం ద్వారా మహారాష్ట్రలో విధంగా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఢిల్లీ పెద్దలు గేమ్ ప్లాన్ చేశారంటూ అన్నారు.

ఈ విషయంపై జార్ఖండ్ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. జార్ఖండ్ లో బీజేపీ ఆపరేషన్ లోటస్ ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయన ఒక సూచన చేశారు. దయచేసి దానిని ఆపరేషన్ లోటస్ అని పిలవకండి.. ఆపరేషన్ కమల్ అని పిలవాలన్నారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఖేరా ఆరోపించారు. నేడు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న తీరు చరిత్రలో నల్ల అక్షరాలతో లిఖించబడుతుందని, నేడు దేశంలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపర్చే విధంగా బహిరంగ కుట్ర జరుగుతోందని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బిజెపి ఇలాంటి ప్రయత్నాలకు నాయకత్వం వహించిందని ఖేరా అన్నారు. ఇప్పుడు వారు జార్ఖండ్‌పై కన్నేశారని ఆరోపించారు.