kerala: ఆటోవాలాల‌కు 3 లీట‌ర్ల డీజిల్ ఫ్రీగా ఇచ్చిన పెట్రోల్ పంప్!

అసలే లాక్ డౌన్ కష్టాలు.. వాటికి తోడుగా సెంచరీ దాటిన పెట్రోల్ ధరలు.. అన్నీ కలిసి ఆటోవాలాలకు బ్రతుకు భారమైంది. దీంతో వారి కష్టాలను అర్ధం చేసుకున్న ఓ పెట్రోల్ పంప్ యజమాని ఆటోవాలాకు మూడు లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్ ఫ్రీగా ఫిల్ చేశారు.

kerala: ఆటోవాలాల‌కు 3 లీట‌ర్ల డీజిల్ ఫ్రీగా ఇచ్చిన పెట్రోల్ పంప్!

Kerala

Kerala: అసలే లాక్ డౌన్ కష్టాలు.. వాటికి తోడుగా సెంచరీ దాటిన పెట్రోల్ ధరలు.. అన్నీ కలిసి ఆటోవాలాలకు బ్రతుకు భారమైంది. దీంతో వారి కష్టాలను అర్ధం చేసుకున్న ఓ పెట్రోల్ పంప్ యజమాని ఆటోవాలాకు మూడు లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్ ఫ్రీగా ఫిల్ చేశారు. కేర‌ళ‌లోని కాస‌ర్‌గోడ్ జిల్లా ఎన్మ‌కాజె గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో ఓ ఫ్యూయ‌ల్ స్టేష‌న్ ఉండగా అబ్దుల్లా మ‌ధుమోల్ దానికి య‌జ‌మాని కాగా.. అయన సోదరుడు సిద్ధిక్ మ‌ధుమోల్‌ మేనేజ‌ర్‌.

అబుదాబిలో చార్ట‌ర్డ్ అకౌంటెంట్‌గా ప‌నిచేస్తున్న మ‌ధుమోల్ ఆటోవాలాల కష్టాన్ని అర్ధం చేసుకొని ఒక అఫర్ ప్రకటించాడు. సోద‌రుడు అబ్దుల్లాను సంప్ర‌దించిన మ‌ధుమోల్ ఆటోవాలాల‌కు 3 లీట‌ర్ల చొప్పున ఉచిత ఇంధ‌నం ప్ర‌క‌టించాడు. సోమ‌వారం ఉద‌యం 6.30 గంట‌ల నుంచి మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు రెండు రోజుల‌పాటు ఈ ఆఫ‌ర్ అమ‌ల్లో ఉండగా మొత్తం 313 మంది ఆటోడ్రైవ‌ర్లు ఈ ఆఫ‌ర్‌ను వినియోగించుకున్నారు. మొత్తం ల‌క్ష రూపాయ‌ల విలువైన ఇంధ‌నాన్ని ఉచితంగా ఆటోలకు ఫీల్ చేసినట్లు ఈ సోదరులు చెప్పారు.

సాధారణ రోజుల్లో 2 నుండి 3 వందల ఆటోలు మధ్యలోనే ఈ స్టేషన్ కి రాగా ఈ అఫర్ రోజు మాత్రం 313 ఆటోవాలాలు వచ్చారట. అయితే, ఈ అఫర్ బిజినెస్ ప్ర‌మోష‌న్ కోసం కాకుండా లాక్‌డౌన్ వేళ, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటిన నేపథ్యంలో సాయ‌ప‌డేందుకే ఆఫ‌ర్ ప్ర‌క‌టించామని చెప్పారు. కాగా, పెట్రోల్ పంప్ యాజ‌మాన్యం ఆఫ‌ర్ ప‌ట్ల ఆటోవాలాలు సంతోషం వ్య‌క్తం చేశారు. ఇప్పటి ఎవ‌రూ ఇలాంటి ఆఫ‌ర్ ప్ర‌క‌టించ‌లేద‌ని తొలిసారి ఈ సోదరులు తమవంతు సాయం చేయడం ఆనందంగా ఉందన్నారు.