South Central Railway: ఆగస్టులో 30 వీక్లీ స్పెషల్ రైళ్లు.. ఏఏ రోజుల్లో అంటే?

దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు నెలలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆయా ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఎస్‌సీఆర్ మంగళవారం తెలిపింది. అదేవిధంగా వలన్‌కన్ని ఫెస్టివల్ సందర్భంగా లోకమన్య తిలక్ – నాగపట్నం మధ్య నాలుగు సర్వీసులను నడపనుంది.

South Central Railway: ఆగస్టులో 30 వీక్లీ స్పెషల్ రైళ్లు.. ఏఏ రోజుల్లో అంటే?

Railway

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు నెలలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆయా ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఎస్‌సీఆర్ (సౌత్ సెంట్రల్ రైల్వే) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.  ఆగస్టు లో పండుగలను పురష్కరించుకొని అదేవిధంగా తిరుమలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. హైదరాబాద్ – తిరుపతి, కాచిగూడ – నర్సాపూర్, తిరుపతి – కాచిగూడ మధ్య రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది.

Indian Railways: రైలు క్యాన్సిలైందని… ప్రయాణికుడికి కార్ బుక్ చేసిన రైల్వే శాఖ

07643 హైదరాబాద్‌ – తిరుపతి మధ్య జూలై 25, ఆగస్ట్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో ట్రైన్స్ నడవనున్నాయి.
07644 తిరుపతి – హైదరాబాద్‌ మధ్య జూలై 26, ఆగస్ట్‌ 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
07612 కాచిగూడ – నర్సాపూర్‌ మధ్య జూలై 25, ఆగస్ట్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో రైళ్లు నడుస్తాయి.
07613 నర్సాపూర్‌- కాచ్చిగూడ మధ్య జూలై 26, ఆగస్ట్‌ 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
07614 తిరుపతి- కాచిగూడ మధ్య జూలై 27, ఆగస్ట్‌ 3, 10, 17, 24, 31 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

అదేవిధంగా వలన్‌కన్ని ఫెస్టివల్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే లోకమన్య తిలక్ – నాగపట్నం మధ్య నాలుగు సర్వీసులను నడపనుంది.