NFH Survey: భారత్‌లో 30% మంది మహిళలకు శారీరక, లైంగిక హింస.. 80శాతం కేసుల్లో భర్తే నేరస్తుడట

దేశంలో మహిళలపై శారీరక, గృహహింస కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చిన్నారులపైనా కామాంధులు లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 సంవత్సరంలోనూ మహిళలు..

NFH Survey: భారత్‌లో 30% మంది మహిళలకు శారీరక, లైంగిక హింస.. 80శాతం కేసుల్లో భర్తే నేరస్తుడట

Women Harassment

NFH Survey: దేశంలో మహిళలపై శారీరక, గృహహింస కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చిన్నారులపైనా కామాంధులు లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 సంవత్సరంలోనూ మహిళలు బయటకు రావాలంటే కొంత భయాందోళన చెందుతున్న పరిస్థితి. దేశంలో మహిళలపై జరుగుతున్న శారీరక, లైంగిక హింసలు అంశంపై జాతీయ కటుంబ ఆరోగ్య సర్వే-5 నిర్వహించింది. ఈ సర్వేలో భారతదేశంలోని దాదాపు మూడింట ఒకవంతు మంది మహిళలు శారీరక, లైంగిక హింసను ఎదుర్కొన్నారని కనుగొంది. దేశంలో మహిళలపై గృహ హింస 31.2% నుండి 29.3%కి తగ్గింది. అయితే 18-49 సంవత్సరాల మధ్య వయస్సు‌గల 30% మహిళలు 15 సంవత్సరాల వయస్సు నుండి శారీరక హింసను అనుభవించారని, అయితే 6%మంది తమ జీవితకాలంలో లైంగిక హింసను అనుభవించారని సర్వేలో వెల్లడైంది. ఈ నివేదిక వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండ్వియా గురువారం విడుదల చేశారు.

NFHS : 70 % మహిళలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు: NFHS సర్వే

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శారీరక, లైంగిక హింసను అనుంభవించిన మహిళల్లో కేవలం 14శాతం మంది మాత్రమే సమస్యను బహిరంగపర్చి నిందితులపై చట్టరిత్యా చర్యలకు దిగుతున్నారు. ఈ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5) సర్వే 18-49 ఏళ్ల వయస్సు గల మహిళలను అధికశాతం సర్వేలో భాగస్వాములను చేసింది. 32% వివాహిత స్త్రీలు (18-49 ఏళ్లు) శారీరక, లైంగిక లేదా భావోద్వేగ జీవిత భాగస్వామి హింసను అనుభవించినట్లు సర్వే కనుగొంది. భార్యాభర్తల హింస యొక్క అత్యంత సాధారణ రకం శారీరక హింస (28%), తర్వాత భావోద్వేగ హింస, లైంగిక హింస. అయితే దేశంలో కేవలం 4% మంది పురుషులు మాత్రమే గృహ హింస కేసులను ఎదుర్కొంటున్నారని సర్వే పేర్కొంది. మహిళలపై గృహహింస అత్యధికంగా కర్ణాటకలో (48%), ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, తెలంగాణ, మణిపూర్, తమిళనాడు ఉన్నాయి. అతి తక్కువ గృహహింస లక్షదీప్‌లో (2.1%)గా ఉన్నట్లు NFHS-5 నివేదికన స్పష్టం చేసింది.

Ministry of Health: పురుషులకంటే మహిళల జీవిత కాలం ఎక్కువ.. ఆ నివేదికలో ఆసక్తికర విషయాలు..

గృహహింస, లైంగిక హింసలను ఎదుర్కొంటున్న వారిలో పట్టణ ప్రాంతాల్లో (24%),గ్రామీణ ప్రాంతాల్లోని (32%) ఉంది. పాఠశాల విద్య పూర్తి చేసిన 18% మందితో పోలిస్తే 40% మంది మహిళలు శారీరక హింసకు గురవుతున్నారని, అయితే పేద వర్గాల స్త్రీల్లో 39శాతం, ధనిక వర్గాల్లో 17% మంది స్త్రీలు గృహ, లైంగిక హింసను ఎదుర్కొంటున్నట్లు సర్వే వెల్లడించింది. అయితే మహిళలపై జరుగుతున్న శారీరక హింస కేసుల్లో 80శాతం కేసుల్లో భర్తే నేరస్తుడుగా ఉంటుండటం గమనార్హం. ఇదిలాఉంటే 18-19 వయస్సు కలిగిన వారికంటే 40-49 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఎక్కువ లైంగిక, శారీరక హింసను అనుభవిస్తున్నారని NFHS-5 నివేదికలో పేర్కొంది.