Coins Swallow: 63 రూపాయి నాణేలు మింగేసిన 36 ఏళ్ల వ్యక్తి.. 48గంటల పాటు ఆపరేషన్

రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన వ్యక్తి 63 రూపాయి నాణేలు మింగేశాడు. జులై 27న తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించి అతని కడుపులో మెటల్స్ ఉన్నట్లు తెలిసింది. ఎక్స్‌రే నిర్వహించగా 63 రూపాయి కాయిన్లు ఉన్నట్లు తెలిసింది.

Coins Swallow: 63 రూపాయి నాణేలు మింగేసిన 36 ఏళ్ల వ్యక్తి.. 48గంటల పాటు ఆపరేషన్

 

 

Coins Swallow: రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన వ్యక్తి 63 రూపాయి నాణేలు మింగేశాడు. జులై 27న తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించి అతని కడుపులో మెటల్స్ ఉన్నట్లు తెలిసింది. ఎక్స్‌రే నిర్వహించగా 63 రూపాయి కాయిన్లు ఉన్నట్లు తెలిసింది.

ఎండీఎం హాస్పిటల్ డాక్టర్ల టీం అతని కడుపులో నుంచి కాయిన్లను తొలగించారు. ఎండోస్కోపిక్ పద్ధతిలో రెండు రోజులపాటు సర్జరీ చేశారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ హెచ్ఓడీ నరేంద్ర భార్గవ్ మాట్లాడుతూ.. కడుపులో నొప్పి రావడంతో ఎక్స్ రే తీశాం. అలా విషయం బయటపడింది. రెండు రోజుల పాటు సర్జరీ చేసి 63 నాణేలు తీయగలిగారు.

“ఓ వ్యక్తి కడుపులో నొప్పి అంటూ హాస్పిటల్ లో చేరాడు. 10-15 కాయిన్ల వరకూ మింగానని చెప్పాడు. కడుపు భాగంలో ఎక్స్ రే తీశాం. అక్కడ చాలా పెద్ద మొత్తంలో మెటల్స్ ఉన్నట్లు కనుగొన్నాం. అతనికి సర్జరీ చేసి అవి బయటకు తీశాం. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది” అని డాక్టర్ భార్గవ అన్నారు.

Read Also: స్విమ్మింగ్ పూల్‌లో దూకిన చిన్నారి…రెప్పపాటులో కాపాడిన తల్లి

సర్జరీ తర్వాత సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరమని సూచిస్తూ.. ఇంటరెస్టింగ్ గా అనిపించిన ప్రతి వస్తువు మింగేయొద్దని వివరించారు.