ఛీ.. చూడలేక సిగ్గుతో చచ్చాం.. ‘365 DNI’ సీన్స్ చూసి షాకైన నెట్ ఫ్లిక్స్ యూజర్లు!

  • Edited By: srihari , June 12, 2020 / 10:06 AM IST
ఛీ.. చూడలేక సిగ్గుతో చచ్చాం.. ‘365 DNI’ సీన్స్ చూసి షాకైన నెట్ ఫ్లిక్స్ యూజర్లు!

అసలే లాక్ డౌన్.. మల్టీఫ్లెక్సుల్లేవు.. బయటకు వెళ్లి మూవీలు చూసే ఛాన్స్ లేదు. ఎలాగో ఓటీటీ ప్లాట్ ఫాంలు ఉన్నాయి కదా… బోరుగా ఉందని ఆన్ లైన్లో ఓ మూవీ చూసిన నెట్ ఫ్లిక్స్‌ యూజర్లకు ఊహించని షాక్ ఎదురైంది. అది కూడా తన పేరంట్స్ తో కలిసి చూసి సిగ్గుతో చచ్చిపోవాల్సి వచ్చిందని వాపోయారు. ఛీ.. ఏం కర్మరా బాబోయ్.. పేరంట్స్ తో కలిసి పోర్న్ మూవీ చూసినట్టు ఉందంటూ తెగ తిట్టిపోస్తున్నారు. ఇంతకీ నెట్ ఫ్లిక్స్‌లో యూజర్లు చూసిన ఆ మూవీ ఏంటో తెలుసా? పోలిష్‌ సినిమా ‘365 DNI’. నెట్ ఫ్లిక్స్ యూకేలో పాపులర్ పోలిష్ ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ బాగా ట్రెండింగ్ అవుతోంది. ఆన్ లైన్ లో రిలీజ్ అయిన ఈ మూవీలో మితిమీరిన శృంగారపు సీన్లు యూజర్లకు విసుగు తెప్పించాయి. 

పోలిష్‌ సినిమా ‘365 DNI అంటే ఏదో యాక్షన్ థ్రిల్లర్ మూవీ కదా అనుకుని పేరంట్స్ తో కలిసి కూర్చొన్నారు. తీరా సినిమా సీన్లను చూస్తే అచ్చం.. పోర్న్ వీడియోను చూసినట్టుగా ఉందంటూ తిట్టుకున్నారు. ఇలాంటి మూవీని తల్లిదండ్రులతో కలిసి చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదంటూ సిగ్గుతో తలపట్టుకోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
365 days

లాక్ డౌన్ లో తమకు ఎదురైన ఈ చెత్త అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా నెట్ ఫ్లిక్స్ యూజర్లు షేర్ చేస్తున్నారు. మూవీలో Blanka Lipinska అనే క్యారెక్టర్.. అందమైన సేల్స్ డైరెక్టర్ Laura (Anna-Maria Sieklucka)తో పాటు డేంజరస్ క్రిమినల్ పాత్రలో Massimo (Michele Morrone) సిలికాన్ మాఫీయా ఫ్యామిలీలో సభ్యుడిగా ఉంటాడు. 
netflix movies

Siciliyలో Massimo ఆమెను కిడ్నాప్ చేస్తాడు. లారా 365 రోజుల పాటు అతడితో పాటే ఉంటుంది. అలా లవ్ లో పడిన ఆమె అతడితో కలిసి రొమాన్స్ చేసిన సన్నివేశాలు యూజర్లకు చిరాకు పుట్టించాయి. ఆ సన్నివేశాల్లో ఎయిర్ హోస్టెస్ పాత్రలో తన కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడిపై ఓరల్ సెక్స్ చేస్తున్నట్టుగా సన్నివేశాలు ఎబ్బేట్టుగా ఉన్నాయని తిట్టిపోస్తున్నారు. ఈ మూవీని చూసిన నెట్ ఫ్లిక్స్ యూజర్లు తమకు ఎదురైన వింత అనుభవాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.