Father’s Adventure : సైకిల్ పై ప్రతినెలా 400 కిలోమీటర్ల ప్రయాణం.. కొడుకు కోసం ఓ తండ్రి సాహసం

తన కొడుకు వివేక్ కు ప్రతినెల రక్తమార్పిడి చేయాల్సి ఉండటంతో ప్రతినెల జార్ఖండ్ లోని గొడ్డ నుండి 400 కిలో మీటర్లు సైకిల్ పై కొడుకుతో కలసి బెంగుళూరులోని ఆస్టర్ ఆసుపత్రికి వస్తాడు.

10TV Telugu News

Father’s Adventure : కన్న బిడ్డలకోసం తల్లి దండ్రులు ఏమి చేయటానికైనా సిద్ధంగానే ఉంటారు. ఎందుకంటే రక్తం పంచుకుపుట్టిన బిడ్డలపై ఉండే ప్రేమ అలాంటిది. జార్ఖండ్ కు చెందిన ఓకన్న తండ్రి తన కొడుకును కాపాడుకోవటంకోసం చేస్తున్న సాహసం గురించి తెలిస్తే ఎంతటి వారైన చలించి పోవాల్సిందే..మాయదారి రోగం బారిన పడి చావుకు దగ్గరౌతున్న కన్న కొడుకును ఎలాగైన కాపాడుకోవాలన్నఓ తండ్రి చేస్తున్నసాహసానికి  సంబంధించి వివరాల్లోకి వెళితే…

జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డ జిల్లాకు చెందిన దిలీప్ యాదవ్ ఓ సాధారణ రైతు కూలి ఇతనికి నలుగురు పిల్లలు. అందులోని ఓ కొడుకు వివేక్ 5 ఏళ్ళకు పైగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. స్ధానికంగా ఈ వ్యాధికి సంబంధించిన సరైన వైద్యం అందుబాటులో లేకపోవటంతో బెంగుళూరులోని ఆస్టర్ ఆసుపత్రిలో చేర్పించాడు.

తన కొడుకు వివేక్ కు ప్రతినెల రక్తమార్పిడి చేయాల్సి ఉండటంతో ప్రతినెల జార్ఖండ్ లోని గొడ్డ నుండి 400 కిలో మీటర్లు సైకిల్ పై కొడుకుతో కలసి బెంగుళూరులోని ఆస్టర్ ఆసుపత్రికి వస్తాడు. రక్తమార్పిడి ప్రక్రియ అనంతరం తిరిగి సైకిల్ పై తమ గ్రామానికి చేరుకుంటాడు. గత 5ఏళ్ళ కాలంగా దిలీప్ యాదవ్ సైకిల్ పై కొడుకుతో సుదీర్ఘమైన ప్రయాణం ప్రతినెల సాగిస్తూ ఉన్నాడు. వివేక్ కు ఎముక మజ్జ శస్త్ర చికిత్స చేస్తే తప్ప వ్యాధి నయమయ్యే పరిస్ధితి లేదు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. దిలీప్ యాదవ్ కుటుంబం ఆర్ధిక పరిస్ధితి అంతంత మాత్రం.

ఈ విషయం తెలుసుకున్న క్రౌడ్ ఫండింగ్ సంస్ధ వివేక్ కు ఆపరేషన్ కు అవసరమయ్యే డబ్బు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో బెంగుళూరులోని ఆస్టర్ హాస్పిటల్ వైద్యులు వివేక్ ఆపరేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వివేక్ సరిపోలిన ఎముక మజ్జ దొరికిన వెంటనే ఆపరేషన్ చేసేందుకు వైద్యులు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు బెంగుళూరులోని ఆసుపత్రికి చికిత్స సమయంలో వెళ్ళేందుకు దిలీప్ యాదవ్ తోపాటు అతని భార్య, నలుగురు పిల్లలకు ఫ్లైట్ టిక్కెట్లను క్రౌడ్ ఫండింగ్ సంస్ధ మిలాప్ ఏర్పాటు చేసింది.

 

10TV Telugu News