4వేల ఏళ్లనాటి లడ్డూలు కనుగొన్న పరిశోధకులు.. పోషకాహరంపై హరప్పా ప్రజలకు అవగాహన

4వేల ఏళ్లనాటి లడ్డూలు కనుగొన్న పరిశోధకులు.. పోషకాహరంపై హరప్పా ప్రజలకు అవగాహన

4000 Years Old Laddoos Found In Harappa.. (1)

4000 years old laddoos found in Harappa : కనుమరుగు అయిపోయిన ఎన్నో చరిత్రలను పరిశోధకులు వెలికి తీసి ఆశ్చర్యపరుస్తుంటారు. భూమి పొరల్లో నిక్షిప్తమైపోయిన ఎన్నెన్నో అద్భుతాలను మనకళ్లముందుకు తెస్తుంటారు. నేలలో దాగి ఉన్న నాగరికతలను తవ్వి ఆశ్చర్యకరమైన వాస్తవాలను కళ్లకు కడుతుంటారు. అటువంటిదే జరిగింది సింధూలోయలో దాగి ఉన్న హరప్పా నాగరికత కాలం నాటి ఓ అద్భుతమైన ఘట్టాన్ని వెలికి తీసారు పరిశోధకులు.

Harappa

 

“ సింధులో వెలసినా ఓ నాటి స్వప్నమా… నా వారి ఘనతను నినదించు నాదమా …. చరణాలు తెగినట్టి పాటలా రాలావే… ఈ నేల పొరలలో చరితవై మిగిలావే….. హే దివ్య సింధు విశ్వజన బంధు నీ కీర్తి కౌముదులు పర్వుదిశలందు”…. అంటూ బాల్యంలో స్కూల్లో పాడుకున్న పాటను మరోసారి గుర్తు తెచ్చారు పరిశోధకులు. హరప్పా నాగరికత కాలం నాటి లడ్డూల వంటి తినుబండారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో లడ్డూలవంటి పదార్థం బయపడ్డాయి. అనేకరకాల ప్రొటీన్లతో నిండిన ధాన్యాలను వినియోగించి ఈ లడ్డూలను తయారు చేశారని..దీనిని బట్టి అప్పట్లో చాలా పోషకాహారాలు కలిగిన ఆహారం తీసుకున్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Harappa 2

 

లక్నోకు చెందిన బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్, ఢిల్లీకి చెందిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంస్థలు రెండూ కలిసి రాజస్థాన్‌లోని బిన్‌జోర్ ప్రాంతంలో ఉన్న హరప్పా నాగరికతకు సంబంధించిన ఆర్కియాలజికల్ సైట్‌లో చాలా కాలంగా పరిశోధనలు జరుపుతున్నాయి. అయితే 2017లో వారికి ఓ 7 లడ్డూలవంటి పదార్థాలు భించాయి. వాటిపై పరిశోధనలు చేసిన ఆర్కియాలజీ శాస్త్రవేత్తలు వీటిని అనేకరకాల ప్రొటీన్లు ఉన్న తినుబండారాలుగా గుర్తించారు.

Harappa 5

పరిశోధనల అనంతరం ఈ లడ్డూలు దాదాపు 2600 బీసీఈ కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు చెప్పారు. వీటిని చాలా జాగ్రత్తగా నిల్వ చేశారని, అయితే ఇవి నీరు తగలడం వల్ల పర్పుల్(లేత వంకాయ రంగు’లోకి మారిపోయాయని వారు చెప్పారు. దీనికి సంబంధించిన శాంపిల్స్‌ను బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ అధికారులకు కూడా అందించినట్లు ఢిల్లీ సంస్థ వెల్లడించింది.