Omicron Cases : దేశంలో 415కి చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. శనివారం ఉదయానికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415 చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది

Omicron Cases : దేశంలో 415కి చేరిన ఒమిక్రాన్ కేసులు

omicron

Omicron Cases : దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. శనివారం ఉదయానికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415 చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక కరోనా నుంచి కోలుకొని 115 మంది ఇళ్లకు వెళ్లినట్లు వివరించింది ఆరోగ్యశాఖ. ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు వేడుకలపై నిబంధనలు విధించాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిమ్, సినిమా థియేటర్లు, పబ్‌లలో 50 శాతం అక్యుపెన్సీతో మాత్రమే నడపాలని తెలిపింది ప్రభుత్వం.

చదవండి : Omicron Effect : క్రిస్మస్ సంబరాలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్..ప్రపంచవ్యాప్తంగా 3,500లకు పైగా ఫ్లైట్స్ రద్దు

మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది ఈ మహమ్మారి. అత్యధిక ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కట్టడికి ఆయా రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిపెట్టాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిబంధనలు విధించాయి. ఇదిలా ఉంటే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

చదవండి : Omicron Medicine : ఒమిక్రాన్ మందులు ఇవే.. కీలక విషయాలు చెప్పిన లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు