Covid Wave: కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కనుమూసిన 420మంది డాక్టర్లు

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లెక్కల ప్రకారం.. (ఢిల్లీలో ఉన్న వారితో కలిపి) 420 డాక్టర్లు కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.

Covid Wave: కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కనుమూసిన 420మంది డాక్టర్లు

Doctors Medical Association

Covid Wave: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లెక్కల ప్రకారం.. (ఢిల్లీలో ఉన్న వారితో కలిపి) 420 డాక్టర్లు కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. మహమ్మారి సెకండ్ వేవ్ ఫలితంగా అంత్యక్రియలకే ఖాళీ లేకుండాపోతుంది. దేశ రాజధానిలో రీసెంట్ గా కేసులు తగ్గడంతో సంక్షోభం నుంచి ఊరట లభించినట్లు అయింది.

కనీసం బీహార్ లో 96మంది డాక్టర్లు, ఉత్తరప్రదేశ్ లో 41మంది చనిపోయినట్లు అసోసియేషన్ వెల్లడించింది. ఈ వారం ఆరంభంలో 270మంది డాక్టర్లు కరోనావైరస్ తో చనిపోయినట్లు తేల్చారు. వారిలో ఐఎంఏ ప్రెసిడెంట్ డా.కేకే అగర్వాల్ కూడా ఉన్నారు.

రెండు వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ సోమవారం రాత్రి 11గంటల 30నిమిషాల సమయంలో చనిపోయారు. కొవిడ్ తో సుదీర్ఘంగా పోరాడి తుది శ్వాస విడిచారని అధికారికంగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా తేలింది.

ఐఎంఏ లెక్కల ప్రకారం.. కొవిడ్ రిజిష్ట్రీలో ఫస్ట్ వేవ్ కారణంగా 748మంది డాక్టర్లు చనిపోయినట్లు తేలింది. సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారింది. ప్రత్యేకించి హెల్త్ కేర్ వర్కర్లు ముందుండి చేస్తుండటంతో ప్రాణ నష్టం కనిపిస్తుందని ఐఎంఏ ప్రెసిడెంట్ డా. జేఏ జయలాల్ అన్నారు.

తాజాగా దేశంలో గడిచిన 24గంటల్లో 2లక్షల 57వేల 299కొవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదవగా వారిలో 4వేల 194మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. వైరస్ ప్రభావంతో జరిగిన నష్టం తల్చుకుని పీఎం మోడీ లైవ్ లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.