43 ఏళ్ల క్రితం శివ శంకర వర ప్రసాద్ ‘చిరంజీవి’ గా మారిన రోజు..

43 ఏళ్ల క్రితం శివ శంకర వర ప్రసాద్ ‘చిరంజీవి’ గా మారిన రోజు..

Siva Shankara Vara Prasad: మెగాస్టార్ చిరంజీవి.. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా అగ్ర సింహాసనాన్ని అధిష్టించిన మాస్ సూపర్ స్టార్.. అంతకుముందు ఆయన సామాన్య కొణిదెల శివ శంకర వర ప్రసాద్.. సరిగ్గా 43 ఏళ్ల క్రితం.. ఇదే రోజున ఆయన చిరంజీవిగా మారారు.

ఆ తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగి మెగాస్టార్‌గా, సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగారు. తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడిగానే కాక, సినీ పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’. ఆ సినిమాలోని తొలి సన్నివేశాన్ని తూర్పు గోదావరి జిల్లాలోని దోసకాయల పల్లిలో 1978, ఫిబ్రవరి 11న చిరుపై చిత్రీకరించారు.

చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాది రాళ్లు’ అయినప్పటికీ మొదట విడుదలైన సినిమా మాత్రం ‘ప్రాణం ఖరీదు’. ఆ తర్వాత ఆయన సుప్రీమ్ హీరోగా, మెగాస్టార్‌గా ఎదగడం అనేది ఓ చరిత్ర. ఆనాటి అపురూప సంఘటనను గుర్తు చేస్తున్న పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్, ఆడియెన్స్ సోషల్ మీడియా వేదికగా మెగా‌స్టార్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Chiranjeevi