4+4 Security for MLA Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భద్రత పెంచిన ప్రభుత్వం.. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కేటాయింపు

ఇటీవల ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరగటంతో ప్రభుత్వం భద్రత పెంచింది. జీవన్ రెడ్డికి బుల్లెట్ ప్రూప్ కారుతో పాటు 4+4 సిబ్బందితో భద్రత కల్పించింది ప్రభుత్వం.

4+4 Security for MLA Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భద్రత పెంచిన ప్రభుత్వం.. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కేటాయింపు

4+4 security for MLA Jeevan Reddy

4+4 security for MLA Jeevan Reddy : ఇటీవల ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరగటంతో ప్రభుత్వం భద్రత పెంచింది. జీవన్ రెడ్డికి బుల్లెట్ ప్రూప్ కారుతో పాటు 4+4 సిబ్బందితో భద్రత కల్పించింది ప్రభుత్వం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్యకు కుట్ర వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రసాద్‌కు సహకరించిన సంతోష్, సుగుణ, సురేందర్, సాగర్‌లను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ బుధవారం మీడియాకు తెలియజేశారు.

నిందతుడిని విచారించి కీలక వివరాలను సేకరించామని.. నాంపల్లిలో ఎయిర్ పిస్టల్, మహారాష్ట్రలోని నాందేడ్‌లో కత్తి , బీహార్‌లో నాటు తుపాకీ కొనుగోలు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ప్రసాద్‌ను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యకు ఓ వ్యక్తి కుట్ర జరిగిన విషయం తెలిసిందే. సదరువ్యక్తిని హైద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read : MLA Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కేకలు వేయటంతో నిందితుడు పారిపోయాడు

నిజామాబాద్ జిల్లా కల్లాడి గ్రామానికి చెందిన పెద్దగాని ప్రసాద్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ లీడర్. అతని భార్య లావణ్య కల్లాడి సర్పంచ్‌గా పని చేస్తోంది. గ్రామ అభివృద్ధి పనులు అన్ని ప్రసాద్ చూసుకుంటున్నాడు. 20 లక్షలు తన సొంతానికి వాడుకోవడంతో 2022 ఫిబ్రవరి నెల లో కలెక్టర్ అతని భార్యను సస్పెండ్ చేసింది.

తన భార్య సస్పెండ్ కావడానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారణమని అతనిపై కక్ష పెంచుకొని హత్యాయత్నం చేయడానికి ప్రసాద్ ప్లాన్ చేశాడు. మహారాష్ట్రలో కత్తిని కొనుగోలు చేశాడు. సంతోష్ సహకారంతో ముస్తఫా ఆర్మ్స్ నాంపల్లి వద్ద ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేశాడు. నిజామాబాద్ కు చెందిన సుగుణ, సురేందర్ సహకారంతో బీహార్ కు చెందిన మున్నా కుమార్ వద్ద రూ.60,000 కు కంట్రీ మెడ్ పిస్టల్ కొనుగోలు చేశాడు. సాగర్ సహకారంతో బీహార్ ముజాఫర్ లో బుల్లెట్లు కొన్నాడు.

ఆగస్టు 1వతేదీ సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటికి ప్రసాద్ చేరుకున్నాడు. ఎమ్మెల్యే మూడో ఫ్లోర్ లో ఉన్నాడని అతడి పని మనిషి గంగాధర్ చెప్పడంతో అతని వద్దకు వెళ్లి ఎయిర్ పిస్టల్ కత్తి బయటకు తీశాడు. ఇది గమనించి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గట్టిగా అరవడంతో ఎమ్మెల్యే సిబ్బంది అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి అతను పారిపోయాడు. ఈ వివరాలను వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ వెల్లడించారు.