Jr NTR : 5 మిలియన్ల క్లబ్‌లో యంగ్ టైగర్..

ప్పడు ట్విట్టర్‌‌లో తారక్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య అక్షరాలా ఐదు మిలియన్లకు చేరింది..

Jr NTR : 5 మిలియన్ల క్లబ్‌లో యంగ్ టైగర్..

Jr Ntr

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో 5 మిలియన్ల మైల్ స్టోన్ టచ్ చేశారు. తారక్‌కి యూత్‌లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు..
జూనియర్ డ్యాన్సింగ్ స్టైల్‌కి విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు డై హార్డ్ ఫ్యాన్స్..

ఇప్పడు ట్విట్టర్‌‌లో తారక్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య అక్షరాలా ఐదు మిలియన్లకు చేరింది.. ఈ సందర్భంగా #5MFollowersForNTR, #ManOfMassesNTR హ్యాష్ ట్యాగ్స్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్..

ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ బ్యాలెన్స్ షూటింగ్ కోవిడ్ కారణంగా వాయిదా పడింది.. ఈ సినిమా తర్వాత కొరటాల శివ, ‘కె.జి.యఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చెయ్యనున్నాడు యంగ్ టైగర్..