Mexico: మెక్సికోలో కాల్పులు.. ఐదుగురు విద్యార్థులు మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. పాఠశాల విద్యార్థులపై ఆయుధాలు కలిగిన కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మెక్సికోలోని గౌనాజాటో ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Mexico: మెక్సికోలో కాల్పులు.. ఐదుగురు విద్యార్థులు మృతి

Mexico

Mexico: మెక్సికోలో దారుణం జరిగింది. పాఠశాల విద్యార్థులపై ఆయుధాలు కలిగిన కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మెక్సికోలోని గౌనాజాటో ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరణించిన విద్యార్థులంతా 16-18 ఏళ్ల లోపు వాళ్లే. మరో మహిళ వయసు 65 సంవత్సరాలు. విద్యార్థుల్లో ముగ్గురు అబ్బాయిలు కాగా, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, ఆసుపత్రికి తరలించారు. మెక్సికోలో కాల్పుల ఘటనలు జరగడం చాలా సాధారణం.

Diabetes: దేశంలో 150 శాతం పెరిగిన మధుమేహ బాధితులు

ఇక్కడ గ్యాంగ్‌వార్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా గౌనాజాటో రాష్ట్రంలో గ్యాంగ్ వార్‌ చాలా కామన్. డ్రగ్స్, ఆయుధాలు వంటివి సరఫరా చేసే గ్యాంగుల మధ్య ఆధిపత్యం కోసం తరచూ కాల్పులు జరుగుతుంటాయి. రెండు వారాల క్రితం కూడా ఒక గ్యాంగ్ వార్ జరిగింది. రెండు గ్యాంగులకు చెందిన సభ్యులు ఒకరిపై ఒకరు జరుపుకొన్న కాల్పుల్లో 11 మంది మరణించారు. దీంతో గ్యాంగ్ వార్‌ల విషయంలో అక్కడి ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరిస్తోంది. పోలీసులకు, స్మగ్లర్లకు కూడా నిత్యం కాల్పులు జరుగుతుంటాయి. 2006 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో దాదాపు 3,60,000 మంది దుండగులు మరణించారు. అయినా, ఇంకా గ్యాంగ్ వార్‌లు ఆగడం లేదు.