Lose Weight : బరువును సులభంగా తగ్గించే 5 రకాల పానీయాలు!

భారతీయ గృహాలలో పసుపు ఇతర మసాలా దినుసుల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంది. బరువు తగ్గడానికి మాత్రమే కాదు, ఔషధ విలువల విషయానికి వస్తే పసుపు ఆల్ రౌండర్ గా చెప్పవచ్చు.

Lose Weight : బరువును సులభంగా తగ్గించే 5 రకాల పానీయాలు!

Weight

Lose Weight : బరువు తగ్గడానికి చాలా మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తుంటారు. అయితే ఇంట్లో లభించే పదార్ధాలతోనే సులభంగా, బరువు తగ్గొచ్చన్న విషయం అవగాహన ఉండదు. సరైన బరును నిర్వహించుకునేందుకు వంటి గంటగదిలో లభించే కొన్ని పదార్ధాలు ఎంతో దోహదం చేస్తాయి. వీటితో చక్కని పానీయాలను తయారు చేసుకుని సేవిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. బరువును తగ్గించటంలో వంటగదిలో లభించే వస్తువుల ఏవిధంగా ఉపకరిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

బరువును తగ్గించే పానీయాలు ;

1. జీరా వాటర్ ; రోజుకు ఒక కప్పు జీరా నీరు అదనపు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగించటంలో సహాయపడుతుంది.

ఎలా తయారుచేయాలి: ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర (ముడి జీలకర్ర)ని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. నీటిని వడకట్టి, నానబెట్టిన జీరాను వేయండి. జీరా నీటిని తక్కువ మంట మీద కొన్ని నిమిషాలు ఉడకబెట్టండి. మీకు కావాలంటే చిటికెడు నల్ల ఉప్పు వేసుకోవచ్చు. అలా తయారు చేసిన పానీయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోండి.

2. వాము వాటర్ ; వాసన కలిగిన వాము విత్తనాలు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. జీలకర్ర వలె, వాము కూడా జీర్ణవ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది బరువు నిర్వహణకు కీలకమైన జీవక్రియకు కూడా సహాయపడుతుంది.

ఎలా తయారుచేయాలి: వాము గింజల ప్రయోజనాలను పొందడానికి, దానిని నీటితో ఉడకబెట్టాలి లేదంటే జీరా లాగా రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని ఒక గ్లాసు తయారు చేసుకుని ఆ పానీయానికి నిమ్మరసం, నల్ల ఉప్పు కలపుకోవాలి. అనంతరం వాటిని సేవించాలి. ఇలా చేస్తే బరువు సులభంగా తగ్గవచ్చు.

3. భారతీయ గృహాలలో పసుపు ఇతర మసాలా దినుసుల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంది. బరువు తగ్గడానికి మాత్రమే కాదు, ఔషధ విలువల విషయానికి వస్తే పసుపు ఆల్ రౌండర్ గా చెప్పవచ్చు.

ఎలా తయారు చేయాలి: ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని తీసుకోండి. దానిలో చిటికెడు పసుపు వేయాలి. ఒక కప్పు వరకు నీరు వచ్చేలా బాగా మరిగించాలి. మరిగే సమయంలో దాల్చినచెక్కను నీటిలో వేయవచ్చు. నీటిని చల్లబడిన తరువాత ఆనీటిని తాగాలి. ఇలా చేస్తే బరువు సులభంగా తగ్గవచ్చు.

4. అల్లం, నిమ్మ నీరు ; అల్లం, లెమన్ వాటర్ బరువు తగ్గడానికే కాదు ఉబ్బరం, గుండెల్లో మంట, వికారం, అజీర్ణం, జీర్ణవ్యవస్థలో తరచుగా సంభవించే సమస్యల ఉపశమనం కలిగిస్తుంది.

ఎలా తయారు చేయాలి: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండాలి. అందులో అల్లం ముక్కను వేయండి. లేకుంటే అల్లం రసాన్ని కూడా జోడించవచ్చు. మంచి రుచి కోసం దాల్చిన చెక్కను వేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ వాటర్ ను తీసుకుంటే బరువు ఈజీగా తగ్గవచ్చు.

5.నిమ్మ, తేనె నీరు ; నిమ్మకాయ తేనె నీరు జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. గట్ కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. ఉదయాన్నే ఒక గ్లాసు నిమ్మరసం తేనె తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని కూడా చెబుతారు

ఎలా తయారు చేయాలి: ఒక కప్పు గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో నాల్గవ వంతు నిమ్మకాయను పిండి, దానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఉదయాన్నే తాగాలి. ఇలా ప్రతిరోజు తాగటం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు.