వెస్ట్ బెంగాల్ లో కరోనా కల్లోలం, మాజీ ఆర్మీ బ్రిగేడియర్ మృతి

  • Published By: madhu ,Published On : July 4, 2020 / 08:01 AM IST
వెస్ట్ బెంగాల్ లో కరోనా కల్లోలం, మాజీ ఆర్మీ బ్రిగేడియర్ మృతి

కరోనాతో 50 సంవత్సరాల ఆర్మీ బ్రిగేడియర్ మరణించారు.  వైరస్ బారిన పడిన అత్యున్నత స్థాయి అధికారిగా చెప్పవచ్చు. తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయంలో పోస్టు చేశారు. కరోనా పరీక్షలు నిర్వహించగా…పాజిటివ్ రావడంతో బరాక్ పూర్ లోని సైనిక ఆసుపత్రిలో చేర్చారు.

కానీ అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కమాండ్ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ ముగ్గురూ వైరస్ బారిన పడి కోలుకున్నారు. బ్రిగేడియర్ చనిపోయారని తెలుసుకున్న సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

వెస్ట్ బెంగాల్ లో కరోనా విస్తరిస్తూనే ఉంది. నార్త్ 24 పరగణాలు, హౌరాలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కరోనా వైరస్ పై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దమ్మెత్తి పోస్తున్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించింది. దీంతో మమత బెనర్జీ ప్రభుత్వం లాక్ డౌన్ ను జులై 31 వరకు పొడిగించింది.

రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు తెరవడానికి వీల్లేదు. ట్రైన్లు, మెట్రో సర్వీసులకు అనుమతినివ్వలేదు. ప్రస్తుతం కేసుల సంఖ్య 20 వేల మార్క్ కు చేరుకుంది. 669 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20 వేల 488కు చేరుకుంది. 717 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేల 200గా ఉంది. 534 మంది గురువారం డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 11 వేల 053 మందికి పరీక్షలు చేశారు.

Read:కరోనాతో చనిపోతే..వారిలో వైరస్ ఎంత సేపు ఉంటుందో తెలుసా